గుంటూరు

ప్రత్తిపాడులో రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఏప్రిల్ 29: నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, కార్యవర్గానికి సంబంధించి శనివారం ప్రత్తిపాడులో నిర్వహించిన అభిప్రాయసేకరణ రసాభాసగా మారింది. ఒకవర్గం సమావేశాన్ని బాయికాట్ చేసి, తరువాత అనుచరులతో రోడ్డుపై రాస్తారోకో చేయటంతో అభిప్రాయ సేకరణ అర్ధంతరంగా నిలిచిపోయింది. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పదవికి, కార్యవర్గం ఎంపికకు పరిశీలకునిగా వచ్చిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య, ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో గ్రామాల వారీగా అభిప్రాయ సేకరణ జరుపుతుండగా ప్రస్తుత మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గింజుపల్లి శివరాంప్రసాద్ తిరిగి అధ్యక్ష పదవికి పోటీకి నిలబడటంతో ఒక్కసారి ప్రత్యర్థివర్గం అధ్యక్ష పదవికి మేం అర్హులం కాదా? అంటూ నూతలపాటి పరమేశ్వరరావు, అయినంపూడి నాగేశ్వరరావు పరిశీలకుల ముందు ఆవేదన వెలిబుచ్చి సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం గుంటూరు- పర్చూరు రహదారిపై ప్రత్తిపాడు ఆంధ్రా బ్యాంక్ వద్ద రోడ్డుకు ద్విచక్ర వాహనాలు అడ్డుపెట్టి బైఠాయించడంతో అభిప్రాయ సేకరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో అర్ధంతరంగా సమావేశాన్ని ముగించారు.
గింజుపల్లి తప్ప ఎవరైనా మాకు సమ్మతమే...
మూడు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన గింజుపల్లి శివరాంప్రసాద్ ప్రస్తుతం గుంటూరు కల్పవల్లి సూపర్‌బజార్ చైర్మన్‌గా కొనసాగుతున్నారని, ఆయనకు తప్ప మండలంలో ఎస్సీ, మైనారిటీలు లేదా ఇతరులకు ఎవరికి ఇచ్చినా సమ్మతమేనని ప్రత్తిపాడు గ్రామ మాజీ అధ్యక్షుడు నూతలపాటి పరమేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శుల ఎంపికకు శివరాంప్రసాద్ తమకు అనుకూలమైన వారిని ఎంచుకుని ఏకపక్షంగా పదవులు కట్టపెట్టారని పార్టీలోని ఓ వర్గం ఎదురు తిరగటంతో విభేదాలు ముదురుపాకాన పడ్డాయి..
మహా పూర్ణాహుతితో పరిసమాప్తమైన విశిష్ట మహా రుద్రయాగం

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 29: శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి శ్రీ విదూషీకర భారతీ స్వామివార్ల దివ్యాశీస్సులతో లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నగరంలోని సంపత్‌నగర్ వేదికగా 5 రోజులుగా నిర్వహిస్తున్న మహారుద్రయాగం శనివారం నాటి మహా పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. సంపత్‌నగర్ శ్రీ శృంగేరీ శారదా పరమేశ్వరీ దేవస్థానంలో ప్రధాన యజ్ఞ స్థలిలో కర్నాటకలోని శృంగేరీ పీఠం నుంచి వచ్చిన 13 మంది రుత్విక్కులకు తోడు నగరంలోని వేద పండితులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహారుద్రునికి పలురకాల ద్రవ్యాలతో పూర్ణాహుతిచేసి శాంతిని కలిగించారు. ఈ సందర్భంగా విశేష సుగంధ ద్రవ్యాలతో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి దశ శాంతులతో సంప్రోక్షణ చేసి అనంతరం మహాభిషేకాన్ని నిర్వహించారు. శృంగేరీపీఠ గుంటూరు గౌరవ ప్రతినిధి పోలిశెట్టి శివప్రసాదరావు, పోలిశెట్టి శ్యాంసుందర్, శారదాపీఠ భక్తబృందం యాగాన్ని పర్యవేక్షించారు. రుత్విక్కులను ఘనంగా సన్మానించారు.

రెడ్డి బాలుర హాస్టల్ భవనానికి శంకుస్ధాపన
నరసరావుపేట, ఏప్రిల్ 29: స్ధానిక వినుకొండ రోడ్డులో శనివారం ఉదయం రెడ్డి బాలుర హాస్టల్ భవనానికి స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా వాస్తు, గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఏవివి రామలింగారెడ్డి, దొండేటి అచ్చిరెడ్డి, కాపులపల్లి ఆదిరెడ్డి, భవనం రాఘవరెడ్డి, పొలిమేర వెంకటరెడ్డి, డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి, సానికొమ్ము కోటిరెడ్డి, వంకా వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.