గుంటూరు

నయన మనోహరంగా అంతర్జాతీయ నృత్యోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 29: ఆంగిక, కరచరణ అభినయ విన్యాసాలతో పాటు సంప్రదాయ శైలికి అద్దంపట్టి, 64 కళలన్నింటిలో విలక్షణం, విశిష్టమై అలరారుతున్న మన కూచిపూడి తెలుగుజాతి కళా కీర్తని పలు రంగాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వారంరోజుల పాటు జరిగే అంతర్జాతీయ నృత్య దినోత్సవాలు నయనమనోహరంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, కార్యదర్శి గుమ్మడి రాధాకృష్ణమూర్తి తొలుత జ్యోతిప్రజ్వలనచేసి లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన పశ్చిమనియోజకవర్గ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ శ్రీ సిద్ధేంద్రయోగి కలల సాకారమే మన కూచిపూడి అన్నారు. ఈరోజున కూచిపూడి ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిందని, ఈ కీర్తి, ఘనత కళామూర్తులందరికీ చెందుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కళలపట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ముఖ్యంగా కూచిపూడి కళా వైభవం భావి తరాలకు దేదీప్యమానంగా అందించాలనే ఆశయంతో 100 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన గుర్తుచేశారు. మరో అతిధి, మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు లలిత కళలతోనే మానవీయ వికాసం సిద్ధిస్తుందనేది వాస్తవమన్నారు. ప్రభుత్వం కళల పరిరక్షణ, ప్రాచుర్యం కళాకారులను సమాదరించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వీటిలో భాగంగానే నంది నాటకోత్సవాలు కూడా ఇటీవల రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారన్నారు. ఆత్మీయ అతిధి బివి పద్మావతి తదితరులు అంతర్జాతీయ నృత్య దినోత్సవానికి కృషిచేస్తున్న నాట్యాచార్య కెవి సుబ్రహ్మణ్యంను అభినందించారు. ఈ సందర్భంగా నాట్యకళానిధి డాక్టర్ చింతా ఆదినారాయణశర్మకు శిష్యబృందం అపూర్వంగా సత్కారాన్ని అందించింది. సభకు ముందు, అనంతరం శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి చెందిన నాట్యాచార్య కాజ వెంకట సుబ్రహ్మణ్యం శిష్యబృందం నూరు మంది, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నర్తకిలు, ప్రధానంగా భాగ్యనగరం నుంచి వచ్చిన ప్రముఖ నాట్యకళా కోవిదురాలు డాక్టర్ వావిలాల సుశీల విభిన్న కూచిపూడి సంప్రదాయ నృత్యాంశాలను నయనమనోహరంగా అభినయించి నటరాజుకు నృత్యాభిషేకం చేశారు. పెద్దసంఖ్యలో కళాభిమానులు తొలిరోజు నాట్య ప్రదర్శనలు తిలకించారు.