గుంటూరు

బాలిక కిడ్నాపర్ త్వరలో అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భట్టిప్రోలు, ఏప్రిల్ 29: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ దేశంలో ఏ మూల దాగివున్నా అరెస్టుచేసి తీరుతామని గుంటూరు ఐజి ఎన్ సంజయ్ అన్నారు. ఈనెల 21్భట్టిప్రోలు గ్రామం నుండి ఐలవరం పాఠశాలకు వెళ్ళిన 8వ తరగతి విద్యార్థినిని అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీరామ నాగేశ్వరరావు కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించి అతడిని అరెస్టు చేసేందుకు ఐదు ప్రత్యేక పోలీసులు బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. అదనంగా మరో ఐదు బృందాలను కూడా ఏర్పాటుచేసి కిడ్నాపర్ ఆచూకిని సేకరించాలని బాపట్ల డిఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియర్‌గా పరిగణనలోకి తీసుకొని గాలిస్తున్నట్లు చెప్పారు. ఇరువురు కుటుంబ సభ్యులను ఇప్పటికే విచారించి వివరాలు సేకరించామని, పోలీసు రంగంలో ఉన్న సాంకేతిక పరిఙ్ఞనాన్ని ఉపయోగించి ఈ కేసును అతి త్వరలో ఛేదిస్తామన్నారు. అనంతరం బాలిక, కిడ్నాపర్ ఫోటోలను ఆయన విడుదల చేశారు. ఆయన వెంట జిల్లా రూరల్ ఎస్సీ నారాయణనాయక్, బాపట్ల డిఎస్పీ మహేష్, రేపల్లె సిఐ పెంచలరెడ్డి, ఎస్‌ఐ నాగిరెడ్డి, అద్దంకి వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.
14, 15 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు
తెనాలి, ఏప్రిల్ 29: త్వరలోనే జిఎస్టీ బిల్లుకు అమోదం తెలుపనున్నందన మే నెల 14,15తేదీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ దేశంలో దూసుకుపోతోందని చెప్పారు. శనివారం తెనాలిలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యే ముందు స్పీకర్ కోడెల రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి ఎడ్లపాటిని పరామర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి యడ్లపాటిని మర్యాద పూర్వకంగానే కలిశామని చెప్పారు. మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభున్నతిని కోరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబాబు నాయుడు తనకు ఆయావర్గాల అభివృద్ధి కోసం పనిచేసే అవకాశం కల్పించారని చెప్పారు. పెద్దలు, సీనియర్లను కలుపుకొని ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా ఇకనుండి 75 యూనిట్స్ వరకు అందిస్తామన్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమంపై దృష్టిసారించానని త్వరలోనే ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యడ్లపాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యవౌతుందని ప్రజలు గ్రహించారని మరోమారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాయకత్వం వహిస్తారని జోస్యం చెప్పారు. అనంతరం యడ్లపాటి వెంకట్రావుకు నూతనవస్త్రాలు సమర్పించారు. పట్టణంలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ కోడెల, మంత్రి ఆనందబాబులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.