గుంటూరు

రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 11: గుంటూరు మార్కెట్‌యార్డులో మిర్చిని అమ్మిన రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి చంద్రన్న రాయితీని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శశిధర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్చి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న రాయితీని సక్రమంగా చెల్లించడంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. మిర్చిరైతులు పంటను అమ్మిన వెంటనే సంబంధిత రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, 45 గంటల్లోనే ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వారికి అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో గుంటూరు మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఉద్యానవనశాఖ డిడి జయచంద్రారెడ్డి, మార్కెట్‌యార్డు కార్యదర్శి దివాకర్, మార్కెటింగ్ శాఖ ఎడి పాల్గొన్నారు.

సూపర్‌వైజర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేదిలేదు..
గుంటూరు, మే 11: గుంటూరు మార్కెట్ యార్డు సూపర్‌వైజర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు హెచ్చరించారు. గురువారం యార్డు సూపర్‌వైజర్లతో రాయితీ పథకం అమలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రైతు రాయితీ పథకం అమలు సక్రమంగా జరిగేందుకు అందరి సహకారం అవసరమన్నారు. కొంతమంది కమీషన్ ఏజంట్లు పథకంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. కమీషన్ వ్యాపారులు రైతుల ఖాతాల్లో రాయితీ పథకం నగదు జమ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారన్నారు. లబ్ధిపొందడానికి వేలాది మంది రైతులు సరుకును అమ్ముకుంటున్నారని, అయితే వందల సంఖ్యలో మాత్రమే వారి ఖాతాల్లో రాయితీ నగదు జమ అవుతుందన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ యార్డులో ఎగుమతిదారుల మిర్చినిల్వలు భారీగా పెరిగిపోయాయని, వాటిని తక్షణమే తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రాయితీ పథకం అమలు కావడానికి పాలకవర్గం, ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. యార్డు సూపర్‌వైజర్లు మరింత ఎక్కువ సమయం కేటాయించి పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. గతంలో యార్డులో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు నిధులు దుర్వినియోగం చేసిన కమీషన్ ఏజంట్ల నివేదికను కూడా తయారు చేయాలన్నారు. దొంగతనాలను నివారించేందుకు ప్రతి షాపు దగ్గర సిసి కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 16వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు యార్డుకు సెలవలు ప్రకటించడం జరిగిందని, 16వ తేదీ తర్వాత రైతులెవ్వరూ మిర్చిని యార్డుకు తీసుకురాకూడదన్నారు. తిరిగి మరలా జూన్ 5వ తేదీ నుండి కొనుగోళ్లు, అమ్మకాలు యదావిధిగా జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ జెడి రామాంజనేయులు, వ్యవసాయశాఖ జెడి కృపానంద్, హార్టికల్చర్ జెడి జయచంద్రారెడ్డి, యార్డు కార్యదర్శి దివాకర్, మార్కెటింగ్ శాఖ డిడి శ్రీనివాసరావు, యార్డు వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, డైరెక్టర్లు చిన బాజి, ఎస్‌ఎస్‌పి జాదా, యార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.