గుంటూరు

భగవంతుని ప్రతిరూపమే అమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 14: భగవంతుడికి ప్రతిరూపమే అమ్మ అని నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ చల్లా అనూరాధ అన్నారు. మాతృదినోత్సవాన్ని ఆదివారం బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బాలాజీ కళ్యాణ మండపంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యాన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కమిషనర్ అనూరాధను సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి బిడ్డ ఎదుగుదలలో తల్లిపాత్ర కీలకమన్నారు. దేవుడు ఎక్కడో లేడని, అమ్మ రూపంలో అనుక్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడని వర్ణించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రత్తిపాటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గోపిచంద్, డాక్టర్ జివి కుమార్, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ సాంబశివారెడ్డి, ఎస్ వెంకట్రామయ్య, గుమ్మడి రాధాకృష్ణమూర్తి, కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.
టిడిపి నాయకుల ఆధ్వర్యంలో...
అంతర్జాతీయ మదర్స్‌డే సందర్భంగా స్థానిక వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి, గుంటూరు తూర్పు ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్, ఎంపిపి రమణ, తోట లక్ష్మితో పాటు పలువురు తమ మాతృమూర్తులను ఘనంగా సత్కరించి, ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా జివి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రేమ, దయ, కరుణ, ఆప్యాయత, అనురాగాలకు ప్రతిరూపం, ఏకైక నిర్వచనం అమ్మ అని తెలిపారు. కానీ నేటి సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రులు పలువురు నిరాదరణకు గురి చేస్తుండటం బాధాకరమన్నారు.
త్యాగానికి ప్రతిరూపం మాతృమూర్తి...
త్యాగానికి ప్రతిరూపం మాతృమూర్తి అని, ఆమె రుణం ఎంత చేసినా తీర్చుకోలేనిదని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవంలో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు అన్నారు. అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ సీనియర్ సభ్యురాలు పి అనూరాధ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బండ్లమూడి హనుమాయమ్మ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ మైలవరపు లలితకుమారి మాట్లాడుతూ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు అమ్మ ప్రేమను సంపూర్ణంగా పొందిన వారేనన్నారు. భాషకు దొరకని అవాజ్యమైనది అమ్మ ప్రేమ అని, మన కోసం దేవుడు ఈ భువిపై ప్రత్యేకంగా అందించిన వరం అమ్మ అన్నారు. ప్రిన్సిపాల్ వరకమలాదేవి మాట్లాడుతూ ఎన్ని యుగాలు, తరాలు మారినా మరువని మాధుర్యం అమ్మ ప్రేమేనన్నారు. అనంతరం సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్న చందు హనుమాయమ్మను సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిజెపి మహిళా మోర్చ ఆధ్వర్యంలో...
బిజెపి మహిళా మోర్చ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాతృమూర్తులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆవుల వీరశేఖరరావు యాదవ్, మహిళా మోర్చ అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

భ్రదతా ఏర్పాట్లు కట్టుదిట్టం

గుంటూరు, మే 14: శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఈనెల 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని జిల్లా రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్ అధికారులను ఆదేశించారు. ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలో పర్యటించిన ఆయన పలు సూ చనలు చేశారు. ముఖ్యంగా పార్కింగ్ ప్రదేశాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు ఏ ఏ ప్రాంతాల్లో పార్క్ చేయాలో సైన్ బోర్డులు ఏ ర్పాటు చేయాలన్నారు. అ లాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చె ందిన వాహనాలతో పాటు ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల వాహనాలు, అసెంబ్లీ సిబ్బంది వా హనాలు క్రమపద్ధతిలో పార్కింగ్ చే సేలా చూడాలన్నారు. పార్కింగ్ ప్రదేశా ల్లో సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా టెంట్లు ఏర్పాటుచేసి, సౌకర్యాలు కల్పించాలన్నారు. శాసనసభాపతి, ము ఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేత, ఇతర అధికారు లు వెళ్లే రూట్లను ఆయన పరిశీలించా రు. పాత్రికేయుల కోసం 4వ నెంబర్ గేటు వద్ద మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎఎస్‌పి విక్రాంత్ పాటిల్, అసెంబ్లీ చీఫ్ మాస్టర్ గణేష్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.