గుంటూరు

తెలుగువారికి అమరావతి ఓ స్వర్ణయుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 15: నూతన రాజధాని అమరావతి నిర్మాణం తెలుగువారికొక స్వర్ణయుగమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తుళ్లూరు, మందడం గ్రామాల మధ్య సోమవారం అమరావతి రాజధాని స్టార్టప్ ఏరియా శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై అవగాహన ఒప్పందం రాజధాని నిర్మాణ ప్రాంత ప్రజల సమక్షంలో జరిగింది. శంకుస్థాపన పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని ప్రాంతం అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం సహకారం ఉందంటే అది ఈ ప్రాంత రైతాంగ స్ఫూర్తి త్యాగాలు, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో సింగపూర్ ప్రభుత్వంతో పాటు అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీ భాగస్వామ్యం కూడా ఉంటుందని, ఈ ప్రాజెక్టు ద్వారా 75 శాతం మనకు, 25 శాతం సింగపూర్‌కు లాభం చేకూర్చడమే కాక 2 లక్షల 50 వేల మందికి మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. టూరిజం, మానవ వనరుల రంగాల్లో సింగపూర్ మాదిరిగానే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. 5 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చేవిధంగా, భావితరాలకు ఉపయోగపడే రీతిలో, ప్రపంచంలోనే 5 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా మన అమరావతిని నిర్మిస్తామన్నారు. తెలుగువారి రాజధాని స్వప్నం సాకారమవుతున్న ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు ఒక వరమని, కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పోలవరం నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ సిటి, జస్టిస్ సిటి, టూరిజం వంటి 9 సిటీలు రహదారుల అనుసంధానంతో నూతన రాజధాని ప్రాంతంలో నిర్మించబడతాయన్నారు. ఈ నిర్మాణాలు కొనసాగిస్తే ఉద్యోగ అవకాశాలు పెరిగి రాజధాని ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించే అవకాశం ఉంటుందని సిఎం తెలిపారు. ఈ ప్రాంతం ఒక గ్రీన్ ఫిల్డ్ సిటీగా రూపుదిద్దుకోబోతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎం, విఐటి, మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాయితీలతో ఈ ప్రాంతంలో భూములు ఇచ్చామని, రాజధానిని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చే ఏ దేశానికి చెందిన కంపెనీలకైనా భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, ఎంపి గల్లా జయదేవ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ కోన శశిధర్, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సమావేశాలు నువ్వు ఆపితే ఆగవు
* కేసుల మాఫీకే ప్రధానితో జగన్ కాళ్లబేరం
* ఎమ్మెల్యే ఆలపాటి

గుంటూరు, మే 15: జిఎస్‌టి బిల్లుపై జరిగే శాసనసభ సమావేశాలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆపితే ఆగవని టిడిపి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆలపాటి రాజా మాట్లాడుతూ రాజ్యాంగపరంగా శాసనసభ సమావేశాలు జరుగుతుంటే వాటిని అడ్డుకుంటామని దౌర్జన్యాలు చేస్తామని ప్రతిపక్ష నేత ప్రచారం చేయటం హేయమన్నారు. ప్రజాస్వామ్యంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్ధమవుతోందన్నారు. గతంలో జరిగిన సమావేశాల తరహాలోనే ఇవి జరుగుతాయని ప్రజా సమస్యలపై ఏ మాత్రం శ్రద్ద ఉన్న చర్చించే వారన్నారు. శాసనసభ హక్కులు కాలరాస్తే ఏం జరుగుతుందనేది జగన్‌కే తెలుస్తుందన్నారు. ఢిల్లీవెళ్లి ప్రధానమంత్రిని కలిసినందుకు తాము ఏ మాత్రం తప్పుపట్టటంలేదన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న జగన్ ప్రధానికి ఇచ్చిన అజెండాలో ఎన్నో అంశంగా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తక్షణమే స్పందించి 15 వందల రాయితీతో పాటు పసుపును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుంటే దీక్షచేసి ఢిల్లీకి వెళ్లటం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించాల్సి వస్తే ప్రజల సమక్షంలోనే కేంద్రానికి వినిపించాల్సి ఉందన్నారు. పాలనా వ్యవస్థలో ఇడిలను తప్పు పడుతూ ప్రధానికి ఫిర్యాదు చేయటం సిగ్గు చేటన్నారు. కేసుల మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లి ప్రధానికి మోకరిల్లారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో రైతులకు ఏ రకమైన మేలు చేశారో తేల్చాలన్నారు. వ్యవస్థలను మేనేజి చేయటం వైఎస్ కుటుంబానికే చెల్లుతుందన్నారు. చంద్రబాబుపై బురదచల్లితే తిరిగి జగన్‌పైనే పడుతుందని వ్యాఖ్యానించారు.
సిపిఐ పోరాటం వల్లే వేలాది మందికి ఇళ్ల స్థలాలు
వినుకొండ, మే 15: సిపిఐ పోరాట ఫలితంగానే జిల్లాలో 22 వేల మంది నిరుపేదలకు గూడు కల్పించినట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక శివయ్య స్థూపం సెంటర్‌లో సోమవారం సయ్యద్ అబ్దుల్ కలాం ఆజాద్ (మసీదు మాన్యం) కాలనీ వాసులకు వౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభకు పఠాన్ లాల్‌ఖాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ వినుకొండ మసీదు మాన్యంతో పాటు పిడుగురాళ్ల, పాత గుంటూరు, గుంటూరు-చిలకలూరిపేట మధ్య తదితర ప్రాంతాల్లో రియల్టర్ల పేరుతో ఉన్న అక్రమ భూములను తమ పార్టీ చేసిన పోరాట ఫలితంగా స్వాధీనం చేసుకుని ఇళ్లులేని నిరుపేదలకు స్థలాలు పంపిణీ చేశామన్నారు. అలాగే స్థానిక మసీదు మాన్యంకు చెందిన భూమిని అక్రమార్కులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తక్కువ ధరలకు కొనుగోలుచేసి అక్రమంగా విక్రయించారని, ఈ నేపథ్యంలో ఈ మాన్యాన్ని తమ పార్టీ ఆక్రమించి పేదలకు రెండు శెంట్లు చొప్పున పంపిణీ చేసిందన్నారు. ప్రస్తుతం సదరు స్థలంలో హరిజన, గిరిజన, పేద, బడుగు వర్గాలకు చెందిన సుమారు 6 వేల కుటుంబాలు గుడిసెలు, ఇళ్లు వేసుకుని నివశిస్తున్నారన్నారు. కాలనీ వాసులకు సరైన వౌళిక సదుపాయాలు లేక అల్లాడుతున్నందున తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ ఇతర సౌకర్యాలు, పట్టాలు, ఓటుహక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు చంద్రపాటి సైదా, మారుతి, అక్బర్ బాషా, టిడిపి నాయకులు గోగినేని సాంబశివరావు తదితరులు మాట్లాడుతూ మసీదు మాన్యం కాలనీ వాసులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, కాలనీ జోలికి వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. అనంతరం శివయ్య స్థూపం నుండి సిపిఐ నాయకులు, కాలనీవాసులు ఎర్రజెండాలు చేతబూని, నినాదాలు చేసుకుంటూ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని మహాధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం తహశీల్దార్ శివనాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి అప్పారావు, యు రాము, బండి కోటయ్య, బి శ్రీనివాసరావు, కె శివరామకృష్ణ, దర్గా మీరావలి, షేక్ సిలార్ తదితరులు పాల్గొన్నారు.