గుంటూరు

హోదా సభకు జనం నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంక్షిస్తూ ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గుంటూరులో నిర్వహించిన భరోసాసభకు జన సమీకరణలో నేతలు విఫలమయ్యా రు. పార్టీ అధికారంలో ఉండగా వివిధ హోదాలను అనుభవించిన ఉద్దండులైన నాయకులు ఉన్నప్పటికీ కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతోనే మమ అనిపించారు. దీంతో నేతల తీరుపై రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం 5.30 నుండి 7.30 గంటల వరకు నిర్దేశించిన సమయం ప్రకారం సభ జరగాల్సి ఉండగా, రాత్రి 9.30 గంటల వరకు సాగింది. గత వారంరోజులుగా పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఏఐసిసి కార్యదర్శి శైలజానాథ్ తదితర నేతలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా తదితరులు జనసమీకరణలో నిమగ్నమయ్యారు. అయితే ఆదివారం భారత్- పాకిస్థాన్‌ల క్రికెట్ మ్యాచ్ ఉన్నందున యువతలో అంతగా స్పందన కనిపించలేదు. వేసవి గాడ్పుల తీవ్రత అధికం కావటంతో సాయంత్రం ఆరు గంటల వరకు సభా ప్రాంగణం వెలవెలబోయింది. గుంటూరు, తెనాలి, వినుకొండ, సత్తెనపల్లి తదితర నియోజకవర్గాల నుంచి మాత్రమే సభకు జనం తరలివచ్చారు. కృష్ణా జిల్లా విజయవాడ నుంచి కూడా అంత పెద్దగా కార్యకర్తలు హాజరు కాలేదు. సభలో అఖిల భారత యాదవ మహాసభ కార్యకర్తలే హడావిడి చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నంత సేపు, ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు మహాసభ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. పొన్నూరు రోడ్డులోని ఆంధ్ర, ముస్లిం కళాశాల ప్రాంగణం మొత్తం పదివేల మందికి నిర్దేశించింది కాగా అందులో సగం మాత్రమే కార్యకర్తలు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొద్దిమంది కార్యకర్తలు కార్లలో తరలివచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి జనాలను తరలించటంలో నాయకులు విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. దీనికితోడు అధికార టిడిపి కార్యకర్తలు, నాయకులు అడుగడుగునా నిరసనలతో అడ్డు తగలటంతో ఉత్కంఠ నెలకొంది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ ఎంపి రాజా, రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు సభకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలోని సభ కావటంతో ఆ పార్టీ కార్యకర్తలలో కూడా స్పందన రాలేదు. రాహుల్ ప్రసంగం పూర్తి కాకుండానే వేదిక ప్రాంగణం నుంచి జనం తిరుగుముఖం పట్టటం కొస మెరుపు.