గుంటూరు

సారారహితంగా పది జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, జూన్ 5: మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖా మంత్రి శామ్యూల్‌జవహర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని మానుకొండ కల్యాణమండపంలో గురజాల ఆర్డీవో మురళి అధ్యక్షతన నవనిర్మాణదీక్ష సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి శామ్యూల్‌జవహర్ మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రాగ్రూపు మహిళలకు పెద్దఎత్తున రుణాలు అందజేసి స్వయం ఉపాధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులు, కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాలుండగా సారారహిత గ్రామాలుగా 10 జిల్లాలను తీర్చిదిద్దిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనన్నారు. ప్రజలు మద్యం మానేసేందుకు నవోదయ కార్యక్రమం ద్వారా గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గంజాయికి విశాఖ జిల్లా కేంద ంగా ఉందని, ఆ జిల్లాలోని గిరిజనుల చేత గంజాయిని పండిస్తున్నారని, ప్రభుత్వం దీనిని అరికట్టి విశాఖ మన్యంలో గిరిజనుల చేత పూల వ్యవసాయం చేయిస్తున్నట్లు మంత్రి జవహర్ పేర్కొన్నారు. వైసిపి రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ మద్యం వ్యాపారం ద్వారా కోట్లు గడించి నీతులు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. బొత్స కారణంగా 200 మంది ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని, ప్రభుత్వం వారికి అండగా ఉండి న్యాయం చేకూరుస్తున్నట్లు తెలిపారు. బొత్స సత్యనారాయణ మద్యాన్ని ప్రోత్సహించి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు మంత్రి జవహర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించి నేడు హోదా కోసం పోరాడతామని చెప్పటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసినప్పుడు ఆ రోజే ప్రత్యేక హోదా కల్పించాల్సిందిపోయి నేడు దాని గురించి చర్చించటం ఆ పార్టీకే చెల్లిందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లిఖార్జునరావు, మున్సిపల్ చైర్మన్ నెల్లూరి మంగమ్మ, డాక్టర్ పార్వతయ్య, పట్టణ అధ్యక్షుడు వేముల దుర్గ, కమిషనర్ గిరికుమార్, ఏడి ఏ కబ్బిరెడ్డి, కౌన్సిలర్లు తుమ్మేపల్లి పెద అంకారావు, వేముల వెంకట కళ్యాణి, దేవిబాయి, తహశీల్దార్ యుగంధర్‌రాము, ఎంపిడివో కుసుమ శ్రీదేవి, సిఐ సత్యకైలాస్‌నాథ్, శివశంకర్, పట్టణ ఎస్సైలు లక్ష్మయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.