గుంటూరు

ఆటో కార్మికుల పొటకొట్టే చర్యలు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 24: రాష్ట్రప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టలుకొట్టే చర్యలు మానుకోవాలని, ఇలాంటి చర్యలు సిపిఐ సహించబోదని పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో నగరంలోని ఆటో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆటోలు అక్కడే తిరగాలనే పద్ధతిని ప్రవేశపెట్టడం ఆటో కార్మికులకు గొడ్డలిపెట్టులాంటిదన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా, నేడు ఆటో కార్మికులను వేధించే నిర్ణయాలను అధికారులు తీసుకోవడం దారుణమన్నారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల్లేక, రాక అనేకమంది నిరుద్యోగులు ఆటోరంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వం సిఆర్‌డిఎ పరిధిలో ఆటోలు అందరికీ ఒకే అనుమతి ఇవ్వాలని కోరారు. ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చయ్య మాట్లాడుతూ ఆటోరంగ కార్మికుల పట్ల అధికారులు తప్పుడు కేసులు బనాయించి అపరాధ రుసుం భారీగా వసూలు చేస్తున్నారని, ఆటో కార్మికుల కుటుంబాలు ఈ చర్యలతో రోడ్డున పడే ప్రమాదముందన్నారు. ఎఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఆటోరంగంపై జీవిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరించాలని లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి జి సురేష్, అమీర్‌వలి, మంగా శ్రీను, కనపర్తి శ్రీను, వెంకటేశ్వర్లు, మస్తాన్‌వలి, కొండారెడ్డి, భాస్కర్, శివయ్య పాల్గొన్నారు.