గుంటూరు

ప్రతి పేదవాడికీ ఇల్లే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, జూన్ 19: చిలకలూరిపేట నియోజకవర్గంలోని ప్రతిపేదవానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం చిలకలూరిపేట పట్టణంలోని పాత మార్కెట్‌యార్డులో జరిగిన 52 ఎకరాల ఇళ్ల నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 52 ఎకరాల్లో ప్రతి ఒక్కరికీ 1.25 సెంట్ల భూమిని ఇస్తే సుమారు 1200 మందికే ఉపయోగం ఉంటుందని, అలాకాకుండా జి ప్లస్-2 కేటగిరిలో ఇళ్ల నిర్మాణం చేపడితే సుమారు 4,300 మందికి లబ్ధిచేకూరే ప్రయత్నం చేశామన్నారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని, అందుకు నిదర్శనంగా కేంద్రప్రభుత్వ నిధులతో ఎన్‌టిఆర్ నగర్‌ను నిర్మించనున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు అడ్డుపడాలని చూస్తూ నిందారోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే ఇండోర్ స్టేడియం, ప్రతి ఇంటికి నీటికుళాయి, మరుగుదొడ్లు, కరెంట్ కొరత లేని చిలకలూరిపేటను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, మార్కెట్‌యార్డు చైర్మన్ విడదల లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు మల్లెల రాజేష్‌నాయుడు, కార్యదర్శి సమ్మద్‌ఖాన్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు మద్దిబోయిన శివ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
గుంటూరు (కొత్తపేట), జూన్ 19: రాష్ట్రప్రభుత్వం ఫెడరేషన్ కులాల వారికి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగ పర్చుకుని కుటుంబ అభివృద్ధి, తద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. స్థానిక కొరిటెపాడు గౌతమినగర్‌కు చెందిన శ్రీ మహిమ రజక కో ఆపరేటివ్ సొసైటీ గ్రూపు సభ్యులకు ఫెడరేషన్ ద్వారా మంజూరైన 6.50 లక్షల రూపాయల సబ్సిడీ రుణాల చెక్కులను ఎమ్మెల్యే మోదుగుల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న కులవృత్తుల జాబితాలో రజకవృత్తి ప్రథమస్థానంలో ఉందని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల మేర ఆర్థికసాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్బన్ జిల్లా బిజెపి ఓబిసి అధ్యక్షుడు కస్తూరి సైదులు, నాయకులు చెన్నూరి చెన్నయ్య, సొసైటీ మహిళలు పోకల పావని, చట్టు విజయలక్ష్మి, కోలవేణి శ్రీదేవి, జి వెంకటరమణ పాల్గొన్నారు.