గుంటూరు

వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రం యువతకు ఆశాకిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, జూన్ 19: నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రథమంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను వినుకొండలో ప్రారంభించడం హర్షనీయమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. స్థానిక కారంపూడి రోడ్డులోని కాకతీయ సేవా సమితి భవన్‌లో సోమవారం వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఎన్టీఆర్ ట్రస్టు ఒక ఆశాకిరణమన్నారు. ఉద్యోగం, ఉపాధి లేక నిరాశా నిస్పృహలకు లోనయ్యే నిరుద్యోగ యువతకు ఈ కేంద్రం ఒక సువర్ణావకాశం కల్పిస్తుందన్నారు. సుమారు మూడు నుండి ఆరు నెలల పాటు వివిధ వృత్తుల్లో ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారని, శిక్షణ పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. కేవలం డిగ్రీలు చదివినంత మాత్రాన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు రావని, విద్యతో పాటు నాణ్యత కలిగిన శిక్షణ కలిగి ఉంటేనే ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాకతీయ సేవా సమితి భవనాన్ని ఎలాంటి అద్దె తీసుకోకుండా స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు ఉచితంగా ఇచ్చినందుకు నిర్వాహకులు గడిపూడి వెంకటరాయుడు, రామయ్యలకు డాక్టర్ కోడెల, ఎంపీ రాయపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ ట్రస్టు సిఈవో విష్ణువర్ధన్, జి రాజీవ్‌రెడ్డిలను సన్మానించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గోనుగుంట్ల లీలావతి, గన్నమనేని వెంకయ్య, రాధాకృష్ణమూర్తి, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
* ఎన్టీర్ మోడల్ స్కూల్‌కు స్థలం
గంగినేని గార్డెన్స్ అధినేత గంగినేని రామయ్య త్వరలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌కు ఆరు ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇవ్వనున్నట్లు కార్యక్రమంలో స్థలదాత రామయ్య ప్రకటించారు.
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరి మృతి
వినుకొండ, జూన్ 19: స్థానిక అరుణా థియేటర్ వద్ద సోమవారం ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శావల్యాపురం మండలం వయ్యకల్లు ఎస్సీ కాలనీకి చెందిన దారా జయరావు కుమార్తె మరియకుమారి అన్న కుమారుడైన జశ్వంత్‌తో కలిసి సొంత పనులపై ద్విచక్ర వాహనంపై వినుకొండ వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతూ డబ్బులు డ్రాచేసుకునేందుకు ఎటిఎం దగ్గర ఆగారు. ఆ సమయంలో వెనుక నుండి వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మోటారు బైక్‌పై ఉన్న మరియకుమారి(23), జశ్వంత్(4) టైర్ల కింద పడ్డారు. క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి మృతదేహాలను సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.