గుంటూరు

పేదల కలల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 19: పేదల సొంత ఇంటి కలలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక అడవితక్కెళ్లపాడులోని రాజీవ్ గృహకల్ప సముదాయం సమీపంలో ఎపి టిడ్‌కో, గుంటూరు నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 487.92 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జి ప్లస్ 3 గృహ నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మాజీ మంత్రి, ప్రత్తిపాడు శాసనసభ్యుడు రావెల కిషోర్‌బాబు అధ్యక్షత వహించారు. మంత్రి ఆనందబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రానున్న రెండేళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాల్లో 24,300 ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. పేదలకు ఇళ్లు కట్టే బృహత్తర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. ఎమ్మెల్యేలు రావెల కిషోర్‌బాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డిలు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వం గృహనిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు లబ్ధిచేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నగరంలో గృహ వసతి కల్పించాలని ఇప్పటికి 30 వేల దరఖాస్తులు వచ్చాయని, ప్రస్తుతం 6,600 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే తొలివిడతగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. అడవి తక్కెళ్లపాడులోని గృహ సముదాయంలో చర్చి, దేవాలయం, మసీదు, పార్కు, పాఠశాలలు ఏర్పాటుచేసి అడవితక్కెళ్లపాడును బంగారు తక్కెళ్లపాడుకు తీర్చిదిద్దుతామన్నారు. కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోన శశిధర్ మాట్లాడుతూ పేదల కలలను నిజం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆనందాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నైపుణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. 2560 మందికి ఇళ్ల నిర్మాణాలను చేపట్టామన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ కింద అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. శాటిలైట్ టౌన్ కింద ఆటస్థలాలు, స్కూల్స్, గ్రీనరీ, రోడ్లు, చక్కటి ప్రమాణాలతో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టామన్నారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి సిఎం 912 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. విజయవాడ నగరంతో సమానంగా గుంటూరు నగర అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరిగేలా, త్వరితగతిన పూర్తి చేయడానికి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, టిడిపి నాయకులు చందు సాంబశివరావు, మద్దాళి గిరిధర్, ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, మనె్నం శివనాగమల్లేశ్వరరావు, నగరపాలక సంస్థ ఎసి రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ మరియన్న, డిప్యూటీ కమిషనర్ ఎం ఏసుదాసు, ఇఇ రాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.