గుంటూరు

వర్షపు నీటిని డ్రెయిన్లలోకి మళ్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 27: నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ నగర పర్యటనలో భాగంగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత ఇన్నర్‌రింగురోడ్డులో పర్యటించిన కమిషనర్ ఆ ప్రాంతంలో వర్షపునీరు నిలిచి ఉండటాన్ని చూసి తక్షణమే నీటిని డ్రెయిన్లలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని శానిటరీ ఇన్స్‌పెక్టర్లను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిని తొలగించి డ్రెయిన్లలో చెత్తను తొలగించాలని పట్టణ, ప్రణాళిక, ఇంజనీరింగ్ ప్రజారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. అనంతరం చాకలికుంట, షాబా హుస్సేన్‌నగర్‌లలో పర్యటించిన కమిషనర్ ఆ ప్రాంతంలో నిర్మించిన బిటి రోడ్లు, డ్రెయిన్లను పరిశీలించారు. షాబా హుస్సేన్ నగర్‌లో డ్రెయిన్ల నిర్మాణం నాశిరకంగా ఉండటం, వాలుగా నిర్మించకపోవడంతో ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. డ్రెయిన్లను నిర్మించిన కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ డ్రెయిన్లకు మరమ్మతులు నిర్వహించి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌చే తనిఖీ నిర్వహించి మురుగునీరు పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని కాలనీ, సంగడిగుంట, కబాడీ గూడెంలలో పర్యటించి ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కబాడీగూడెం ప్రాంతంలో ఆహార వ్యర్ధాలు కాల్వల్లో పడవేసి ఉండటాన్ని చూసి ప్రజలకు తగు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. పర్యటనలో కమిషనర్ వెంట ఇఇ లక్ష్మయ్య, డిఇ సాంబశివరావు, ఎఇ, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.