గుంటూరు

ఆస్థి వివాదంలో దంపతుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర్ల, జూన్ 27: ఆస్థి వివాదంలో మండలంలోని వీరవట్నం గ్రామంలో మంగళవారం జంట హత్యలు జరిగాయి. తోడబుట్టిన అక్క, ఆమె భర్తను మృతురాలి సోదరుడు సింహాద్రి రామిరెడ్డి కిరాతకంగా హత్య గావించాడు. తన కుమారుడిని పదేళ్లు పెంచి పోషించారన్న ఇంగితజ్ఞానం కూడా హంతకుడికి లేకపోయింది. పోలీసుల కథనం ప్రకారం... వివరాలిలా ఉన్నాయి... వీరవట్నం గ్రామానికి చెందిన సింహాద్రి రామిరెడ్డి అతని సోదరి సుబ్బమ్మ (50), బావ రమేష్‌రెడ్డి (55)ల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. రామిరెడ్డి తండ్రికి చెందిన పొలమును సుబ్బమ్మ, రమేష్‌రెడ్డిలు తమకు ఇచ్చారంటూ వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకుని పట్టాదార్ పాస్ పుస్తకాలను పొందారు. ఈ విషయమై అక్కాతమ్ముళ్ల మధ్య గత ఐదేళ్లుగా వివాదం నడుస్తుంది. గ్రామంలో పెద్దలు, బంధువులు వారి మధ్య రాజీ కుదిర్చినా అది సఫలం కాలేదు. ఈ దశలో పొలంలోకి రామిరెడ్డిని రానివ్వకుండా మృతులు స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ ఘటనతో విసుగుచెందిన రామిరెడ్డి తన అక్క, బావల అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారికి సంతానం లేకపోవడంతో ఆస్థి తనకే దక్కుతుందని భావించాడు. గ్రామంలో చిల్లరకొట్టు నిర్వహిస్తున్న తన అక్క ఇంటికి వెళ్లిన రామిరెడ్డి సుబ్బమ్మపై కారం చల్లి వేట కొడవలితో దాడిచేసి హత్యగావించాడు. అనంతరం పొలంలో పనిచేసుకుంటున్న బావ రమేష్‌రెడ్డి వద్దకు వెళ్లి అదేరీతిలో హత్యచేశాడు. ఈ సంఘటన తెలుసుకున్న నర్సరావుపేట డిఎస్‌పి కె నాగేశ్వరరావు, రూరల్ సిఐ ప్రభాకర్, ఎస్‌ఐ నక్కా ప్రకాశరావులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుల బంధువులు సమీపంలో లేకపోవడంతో వారికి సంబంధించిన వారి వద్ద నుండి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.
గ్రామంలో పోలీసు పికెట్...
జంటహత్యల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. నర్సరావుపేట రూరల్ సిఐ ప్రభాకర్, రొంపిచర్ల ఎస్‌ఐ ప్రకాశరావును పికెట్‌ను పర్యవేక్షిస్తున్నారు.