గుంటూరు

సమ్మెబాట పట్టిన వస్త్ర వ్యాపారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూన్ 27: కేంద్ర ప్రభుత్వం జూన్ 30 అర్ధరాత్రి నుండి అమలుచేయనున్న జిఎస్‌టి బిల్లుకు వ్యతిరేకంగా వస్తద్రుకాణాల యజమానులు మంగళవారం తెనాలి పట్టణంలోని గాంధీచౌక్‌లో మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు. తెనాలి క్లాత్ మర్చంట్స్ హోల్‌సేల్ అండ్ రిటైల్స్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన, మానవహారం కార్యక్రమంలో వందలాది మంది షాపుల యజమానులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ జి నరసింహులుకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిఎస్‌టి ప్రకారం వస్తద్రుకాణ వ్యాపారులపై 5శాతం పన్ను అదనంగా పడుతుందని ఈమొత్తాన్ని వినియోగదారులపై ఆర్థిక భారాన్ని పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిఎస్‌టి ప్రకారం వ్యాపారం చేయాలంటే చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోమారు వస్త్రాల విక్రయాలపై విధించిన పన్ను విషయంలో ఆలోచనచేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కొత్తమాసు హేమశ్రీనివాసరావు, కార్యదర్శి కొల్లిపర శ్రీనివాసరావు, సభ్యులు, వందల సంఖ్యలో వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు.