గుంటూరు

చేనేత కార్మికుల ప్రదర్శన, ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 27: చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిలపల నూలుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదుశాతం వస్తుసేవా పన్నును తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంగళగిరిలో చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన వస్త్ర ఉత్పత్తిదారులు, కార్మికులు, చేనేత అనుబంధ ఉపవృత్తుల వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. పాత మంగళగిరి కల్యాణ మండపం నుంచి పట్టణ ప్రధాన వీధులగుండా సాగిన ప్రదర్శన తహశీల్దార్ కార్యాలయానికి చేరింది, అక్కడ సుమారు గంటసేపు ధర్నా నిర్వహించారు. చేనేత పరిరక్షణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జొన్నాదుల వరప్రసాద్, పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 43 లక్షల మంది చేనేత కార్మికులు, ఉపవృత్తుల వారు వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారని, చేనేత పరిశ్రమపై మొత్తం ఏడుకోట్ల మంది ప్రజానీకం ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని, చిలపలనూలుపై ఐదుశాతం పన్ను, చేనేత వస్త్రాలపై 18 శాతం పన్ను విధించడం దుర్మార్గమన్నారు. చేనేతకు అంబాసిడర్‌గా ఉంటానన్న నరేంద్రమోడి సంక్షేమ పధకాలను ఎత్తి వేయడమే కాకుండా అదనంగా పన్నుల భారం మోపారన్నారు. మిల్లు వస్త్రాలు, పవర్‌లూమ్‌ల ధాటికి ఇప్పటికే చేనేత పరిశ్రమ విలవిలలాడుతోందని, లక్షల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతున్నారన్నారు. చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ వస్తుసేవా పన్ను నుంచి చేనేత పరిశ్రమను మినహాయించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, వైస్‌చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు కార్మికులకు మద్దతుగా ప్రదర్శన, ధర్నాలో పాల్గొన్నారు. చేనేత పరిరక్షణ కమిటీ ప్రతినిధులు జగ్గారపు సుబ్బారావు, రామనాధం పూర్ణచంద్రరావు, రావెల శివసత్యనారాయణ, గుత్తికొండ ధనుంజయరావు, మాచర్ల సుధాకర్, కూరపాటి కోటేశ్వరరావు, జెవి సుబ్బారావు, బి మోహనరావు, మునగాల రమేష్, నందం అబద్దయ్య, బాలతేజ, రామారావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కార్యాలయంలో అందజేశారు.