గుంటూరు

ఆకట్టుకున్న జీవితార్ధం నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఏప్రిల్ 24: నేడు ప్రేమలు, బంధాలు, అనుబంధాల అర్ధాలు మారిపోతున్నాయి. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రపంచమే ఓ కుగ్రామంలా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మన కుటుంబ వ్యవస్థ కూడా కుంచించుకు పోతోంది. చిన్న కుటుంబాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నాశనం చేశాయి. స్వార్ధంతో, సంకుచిత మనస్థత్వంతో మన కుటుంబ వ్యవస్థను మనమే కూలద్రోసుకుంటుంటే బంధాలకు, అనుబంధాలకు ఏ విలువా ఉండదు. సంపాదనే ధ్యేయంగా వ్యాపార సంస్కృతికి పెద్దపీట వేసి, మానవత్వపు విలువలను మర్చిపోయే నేటితరం కన్నవాళ్ళను నిర్లక్ష్యం చేస్తుంది. అనే ఇతివృత్తంతో సాగిన నాటకం జీవితార్ధం. ఈ నాటకానికి రచన, దర్శకత్వాన్ని కావూరి సత్యనారాయణ నిర్వహించారు. స్థానిక భువనచంద్ర టౌన్‌హాల్లో ఈ నాటకాన్ని ఆదివారం రాత్రి ప్రదర్శించారు. నటీ, నటులు తమ నటనను అద్భుతంగా ప్రదర్శించారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు మార్క్స్ మహాశయుడు. అందుకే.. బిడ్డను నమ్ముకున్న అర్థశాస్త్రం ముందు.. పెద్దలు నమ్ముకున్న జీవితశాస్త్రం ఓడిపోతుంది. బతకడానికి వ్యాపారం చేయవచ్చేమో గానీ, కన్నవాళ్ళతో వ్యాపారం చేయడం చాలా దారుణం. ఇరుకు గదుల్లో ఉండడం ఇబ్బందైనా ఎలాగోలా ఉండోచ్చుకానీ.. పిల్లల గుండె గదులు ఇరుకైతే మాత్రం ఉండలేము. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కన్నబిడ్డలకు తానుకన్న బిడ్డలు కూడా అదే వైఖరి ప్రదర్శిస్తే ఏం చేస్తారు? ఏలా స్పందిస్తారు? అవసాన దశలో ఉన్న వృద్ధులను వారి పిల్లలే వెలివేస్తే ఏవరు వారిని ఆక్కున చేర్చుకుంటారు? మరింకెవ్వరు ఆదరిస్తారు అనే ఆవేదనాభరిత వాస్తవ ఘటనలకు నిలువెత్తు దర్పణం జీవితార్ధం నాటకం. ఈ నాటకం నందినాటక పోటీల్లో ప్రథమ బహుమతిగా బంగారు నందిని గెలుచుకున్నట్లు నాటక రచయిత, దర్శకులు కావూరి సత్యనారాయణ తెలిపారు. ఈ నాటకాన్ని నరసరావుపేట రంగస్థలి ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగస్థలి నిర్వాహకులు కె వెంకట్రావు, పాషా, డాక్టర్ వడ్డవల్లి పుష్పలత, ఆర్డీవో ఎం శ్రీనివాసరావు, జవ్వాజి గంగాధరరావు, మహ్మబూబ్ సుభానీ తదితరులు నాటకాన్ని పర్యవేక్షించారు.