గుంటూరు

మంగళగిరిలో మువ్వనె్నల జెండా రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 15: భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం మంగళగిరి, పరిసర గ్రామాల్లోను త్రివర్ణపతాకం రెపరెపలాడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట, విద్యాసంస్థల్లోను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) జాతీయ జెండాను ఎగురవేశారు. తహశీల్దార్ విజయలక్ష్మి పాల్గొన్నారు. మండల పరిషత్ ఎదుట ఎంపిపి రత్నకుమారి జెండా ఎగురవేశారు. ముఖ్య అతధిగా పాల్గొన్న ఆర్కే మాట్లాడుతూ అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేశారు. కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు, వైస్‌చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు, కౌన్సిలర్లు ఆషాబాల, గోవాడ రవి, మనె్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌ఎం చైతన్య హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే ఆర్కే జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పార్టీ నాయకులు తోట సాంబశివరావు, జంజనం భిక్షారావు, డి కుబేరస్వామి, ఎ వెంకటస్వామి, మండ్రు శ్రీనివాస్, రంగిశెట్టి పెద్దబ్బాయి, రామనాధం పూర్ణ తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. చినకాకానిలో గల హాయ్‌లాండ్ ప్రాంగణంలో జిఎం కాంతారావు జాతీయ జెండాను ఎగురవేశారు. నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను చంద్రశేఖర్ ఎగురవేశారు. పట్టణంలోని ఎంఎంకె స్టేడియంలో పారిశ్రామికవేత్త ఎం సాంబశివరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంజుమన్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ముస్లిం యువతరం కన్వీనర్ ఎండి ఇక్బాల్ ఎగురవేశారు. బిజెపి కార్యాలయంలో జాతీయ జెండాను ఎఫ్‌సిఐ సభ్యుడు జగ్గారపు రాము ఆవిష్కరించారు. జాతీయ చేనేత బోర్డు సభ్యుడు జె శ్రీనివాస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు. చినకాకాని జడ్‌పి హైస్కూల్‌లో జడ్‌పిటిసి మెంబర్ ఆకుల జయసత్య జాతీయ జెండాను ఎగురవేశారు.

అమరుల ఆశయాలను నెరవేర్చాలి
గుంటూరు, ఆగస్టు 15: దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన త్యాగధనుల ఆశయాలు నెరవేరినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బృందావన గార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జివి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. అనంతరం జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

అర్బన్ బిజెపి ఆధ్వర్యంలో...
త్యాగదనుల స్ఫూర్తితో దేశ ప్రజలందరూ ముందడుగు వేయాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయ పేర్కొన్నారు. బిజెపి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు మాట్లాడుతూ గడిచిన 70 సంవత్సరాల్లో దేశం ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని మరింత అభివృద్ధి పధంలో పయనింపజేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. తొలుత జాతీయ జెండాన్ని నాయకులు ఆవిష్కరించారు.

నవ భారత నిర్మాణ
రథసారథులు యువకులే...
నవభారత నిర్మాణ రధసారధులు యువకులేనని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఉద్ఘాటించారు. స్థానిక అరండల్‌పేటలోని వైసిపి జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా పేదరిక నిర్మూలన జరగకపోవడం బాధాకరమన్నారు. తొలుత జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు.

ఆంధ్రుల త్యాగాలు అపూర్వం
దేశ స్వాతంత్య్రం కోసం ఆంధ్రులు చేసిన త్యాగాలు అపూర్వమని గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మన్నవ మాట్లాడారు. యార్డు కార్యదర్శి ఎం దివాకర్, వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, డైరెక్టర్‌లు బాణావత్ రాజీ, దయారత్నం, చిన బాజీ తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల త్యాగాలు మరువలేనివి...
భారతదేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిలు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ అనూరాధ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే పండుగ ఇదన్నారు. అదనపు కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ మరియన్న, సిటీ ప్లానర్ చక్రపాణి, ఎసిపి ఎం హర్జానాయక్, ఎంహెచ్‌ఒ శోభారాణి, మేనేజర్ బి వెంకటరామయ్య, నమ్రత్‌కుమార్ పాల్గొన్నారు.

కన్నా స్కూలులో...
స్థానిక ఆర్టీసీ కాలనీలోని కన్నా పాఠశాలలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కన్న విద్యాసంస్థల అధినేత కన్న మాస్టారు త్రివర్ణ పతాకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ త్యాగధనుల స్ఫూర్తితో విద్యార్థులు ముందడుగు వేయాలన్నారు.