గుంటూరు

దేశాభివృద్ధికి ప్రతిపౌరుడూ కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేమూరు, ఆగస్టు 15: ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశభక్తుల బలిదానాలవల్లనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో బాధ్యతగా వ్యవహరించాలని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. వేమూరు పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి ఆనందబాబు జాతీయ జెండాను మంగళవారం ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు అధ్యక్షత వహించారు. ఈక్రమంలోనే గౌతమబుద్ధ చారిటబుల్ ట్రస్ట్ జొన్నలగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రకటించారు. మంత్రి మాట్లాడుతూ 200 సంవత్సరాలపాటు విదేశీయుల పాలనలో భారతీయులు మగ్గారన్నారు. నాడు దేశంలోని ఆర్థిక, సామాజిక, అసమానతల పరిస్థితులుండేవని ఈ 70 సంవత్సరాల స్వాతంత్య్ర భారతావనిలో అనేక రకాలుగా అభివృద్ధి చెందామన్నారు. అక్షరాస్యత, ఆర్థికంగా 70 శాతం పురోభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. నాటి కాంగ్రెస్ పార్టీ దేశస్వాతంత్య్రం కోసం పోరాడితే నేడు ఆ పార్టీ పేరు చెప్పుకొని దేశాభివృద్ధికి ఆటంకంగా మారారని విమర్శించారు. నందమూరి తారక రామారావు ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పార్టీని ఏర్పాటు చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారన్నారు. అందుకు నిదర్శనం లోటుబడ్జెట్‌గా ఉన్న నూతన రాష్ట్రంలో 28 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసినట్లు రానున్న సంవత్సరంలో లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా మారి, వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే మనరాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఎల్‌ఐసి పాలశీలు ఎక్కువగా చేసినందున వేమూరు గ్రామానికి 75వేల రూపాయలు చెక్కును తెనాలి బ్రాంచ్ మేనేజర్ పంచాయితీకి మంత్రి చేతులమీదగా అందజేశారు. విజయబాబు నేతృత్వంలో ఏర్పాటైన ట్రస్ట్ ద్వారా పలువురు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 35వేల రూపాయల నగదు బహుమతులు, స్వచ్ఛ్ వేమూరులో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం పేదలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం, వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన అధికారులు, రైతులు, జర్నలిస్టులను మంత్రి సన్మానించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి మంత్రితోపాటు పలువురు పూలమాలలువేసి నివాళులు అర్పించారు.