గుంటూరు

ప్రజా రాజధానితో ప్రపంచ గుర్తింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 15: రాజధాని అమరావతితో అభివృద్ధిలో జిల్లా అగ్రగామిగా నిలుస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో మంగళవారంనాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు 33వేల 696 నివాస, 24057 వాణిజ్య ప్లాట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో 7 ప్రధాన రహదార్ల అభివృద్ధి, సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు రాజధాని చుట్టూ ఇన్నర్, అవుటర్ రింగురోడ్లు, జాతీయ విద్యా, వైజ్ఞానిక సంస్థల ఏర్పాటుతో రానున్నకాలంలో జిల్లా అభివృద్ధిపధంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రైతులను ఆదుకునేందుకు 2017-18 ఖరీఫ్ సీజన్‌కు 5412 కోట్ల పంట రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు మూడువేల కోట్లు వివిధ బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 80వేల 913 మట్టి నమూనాలు సేకరించి 2,36,744 భూసార విశే్లషణాపత్రాలను రైతులకు అందజేశామన్నారు. ఉద్యానవన పంటలకు 20కోట్ల 35 లక్షలతో వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నీరు- ప్రగతి కార్యక్రమం కింద 181 చెక్‌డ్యామ్‌లు లక్షా 63వేల సమాంతర నీటి కందకాలు, 363 పెర్కొలేషన్ ట్యాంకులు ఏర్పాటయ్యాయని వివరించారు. నీరు- చెట్టు పథకం కింద ఇప్పటి వరకు 34 కోట్ల ఖర్చుతో 50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత జరిగిందన్నారు. కృష్ణాపశ్చిమ డెల్టా కాల్వల ఆధునికీకరణ పనుల కోసం రూ. 840 కోట్లు కేటాయించామన్నారు. స్వచ్ఛ్భారత్ మిషన్ ద్వారా 415 గ్రామ పంచాయతీలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ. 1306 కోట్లతో 78వేల 587 ఇళ్లు, పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 427 కోట్లతో 12వేల 205 గృహాల నిర్మాణాలు చేపట్టామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2లక్షల 78వేల పనిదినాలకు 168 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా కింద 3.84 లక్షల మంది లబ్దిదారులకు నెలకు 41కోట్ల 90లక్షల ఫించన్లు, చంద్రన్న బీమా ద్వారా 5908 మందికి 39కోట్ల 42 లక్షలు, బ్యాంకు లింకేజీ కింద జిల్లాలో ఇప్పటి వరకు నాలుగువేల స్వయం సహాయక సంఘాలకు 111 కోట్ల 53లక్షల రుణాలు మంజూరయ్యాయన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెలా 14లక్షల 57వేల కార్డుదారులకు 21వేల 23 మెట్రిక్ టన్నుల బియ్యం,74 టన్నుల మేర పంచదార పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. పరిశ్రమల కేంద్రం ద్వారా 3772 కోట్లతో 88 భారీ, మధ్యతరహా పరిశ్రమల స్థాపనతో 28వేల మంది ఉపాధి పొందారన్నారు. ఏపి ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 19 పారిశ్రామిక పార్కుల నిర్మాణాలకు గాను 818 ఎకరాల భూమిని అభివృద్ధి చేశామని మరో 201 కోట్లతో 23 ఎకరాల్లో ఐటి పార్కును ఇటీవలే సిఎం ప్రారంభించారని గుర్తుచేశారు. పులిచింతల ప్రాజెక్టు కింద 12వేల 555 ఎకరాలు సేకరించి 150 కోట్ల మేర నష్ట పరిహారం రైతులకు చెల్లించామన్నారు. నాగార్జునసాగర్ కాలువల ఆధునీకరణ పనులకు ప్రపంచ బ్యాంక్ నిధులతో జిల్లా పరిధిలో ప్రధాన కాల్వకు 493 కోట్లు, నీటి పంపిణీదారుల సంఘాల పరిధిలో గల కాలువలకు 323 కోట్లు, నీటి వినియోగదారుల సంఘాల పరిధిలో ఆధునికీకరణకు 350 కోట్లు వెచ్చించామన్నారు. అమరావతిలో హృదయ్, ప్రసాద్ స్కీముల ద్వారా వౌలిక సదుపాయాలు, పర్యాటకుల సౌకర్యార్ధ బుద్ధ ప్రాజెక్టు వద్ద 20 పడకల వసతి గృహం నిర్మాణాలు చేపట్టామన్నారు.

ఆకట్టుకున్న శకటాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిపై ఏర్పాటుచేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం వివిధ పథకాల కింద లబ్దిదారులకు ఆర్ధిక సహాయాన్ని మంత్రి అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్, జెసి కృతికా శుక్లా, ఎస్పీలు విజయారావు, వెంకటప్పలనాయుడు, కమిషనర్ సిహెచ్ అనురాధ, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.

మహనీయుల త్యాగఫలం
నరసరావుపేట, ఆగస్టు 15: మహనీయుల త్యాగాలే నేటి స్వాతంత్య్ర దినోత్సవ ఫలాలని ఆర్డీవో గంధం రవీందర్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పరిపాలనాధికారి లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. ఈ ఏడాది కాలంలో డివిజన్‌లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. నరసరావుపేట డివిజన్‌లో ప్రతి నెలా కిలో రూపాయి బియ్యం పథకం కింద 2,48,320 రేషన్ కార్డులకు గాను, 4175.345 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈపాస్ మిషన్ ద్వారా అందచేస్తున్నామని అన్నారు. మీ భూమి పోర్టల్ ద్వారా వెబ్‌ల్యాండ్ నమోదును పరిశీలించేందుకు అవకాశం ఏర్పడి, సవరణలకు దరఖాస్తు చేసేందుకు వీలు కల్పించడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ-పంట నమోదు ద్వారా వాస్తవ సాగుపంటలకు రుణం, పెట్టుబడుల రాయితీ పొందే వీలు కలిగిందన్నారు. బుధవారం నుండి ఈనెల 31 వరకు గ్రామ సభలు నిర్వహించి, రైతుల నుండి భూ రికార్డుల సవరణల కోసం దరఖాస్తులు సేకరించి, సవరణ చేసే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. విద్యార్థుల సేవలో రెవెన్యూ శాఖ ద్వారా డివిజన్‌లో మీసేవ ద్వారా 18,539 కుల ధ్రువీకరణ పత్రాలను అందచేశామని తెలిపారు. కౌలుదారులను గుర్తించి ఈ ఏడాది 5835 బుణ అర్హత కార్డులు అందచేశామన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి నూతన బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణం కోసం డివిజన్‌లో తొలి విడతగా నకరికల్లు, రొంపిచర్ల, శావల్యాపురం మండలాల్లో 579.25 ఎకరాల పట్ట్భామి, 80.48 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి, రైల్వే శాఖకు స్వాధీనం చేశామన్నారు. రైల్వేలైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. డివిజన్‌లోని అంగలూరు, గుమ్మనంపాడు, పి అప్పాపురం, లింగంగుంట్ల అగ్రహారం, నూజండ్లపల్లి అగ్రహారం గ్రామాలకు సంబంధించిన ఈనాం రద్దు చట్టం కింద సర్వే పనులు చేయాల్సి ఉందన్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణం కింద డివిజన్‌లో 6250గృహాలు మంజూరు కాగా, ఇప్పటికి 5267 గృహాలు వివిధ దశలలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. పట్టణ గృహ నిర్మాణం పథకం కింద 4419 గృహాలు మంజూరై, నిర్మాణం జరగబోతుందన్నారు. అదే విధంగా వ్యవసాయశాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్, డిఆర్‌డిఏ, వెలుగు శాఖ, ప్రజారోగ్య శాఖ, విద్యుత్, రోడ్లు భవనాలు, వైద్య, ఆరోగ్యం తదితర అంశాల్లో డివిజన్ ముందుందని అన్నారు. తహశీల్దార్ విజయజ్యోతికుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరగాలన్నారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆదినారాయణ మాట్లాడుతూ కార్మిక చట్టాలు ఎప్పటికప్పుడు మారుస్తూ, కార్మికుల భద్రతను కాపాడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ హనుమంతురావు, విఆర్వోలు, విఆర్‌ఏలు పాల్గొన్నారు. తొలుత ఆర్డీవో కార్యాయలం ప్రాంగణంలో ఆర్డీవో రవీందర్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి, వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యువతలో జాతీయతాభావం పెరగాలి
తెనాలి, ఆగస్టు 15: యువతలో దేశభక్తి, జాతీయతాభావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెనాలి ఆర్డీఓ నరసింహులు పేర్కొన్నారు. 71వ జాతీయ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన 1వ పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటిబాలలే రేపటి పౌరులన్న పెద్దల మాటలను నిజంచేయాలంటే ఇప్పడి బాల, బాలికలలో జాతీయతాభావం, దేశభక్తిని పాఠ్యాంశాలలోచేర్చి ఇనుమడింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కోర్టు ఆవరణలో జిల్లా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఏవి రమణకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరులకు ఘన నివాళులు అర్పించారు. భారతీయుల ఐకమత్యమే ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమైందని, ఆక్రమంలోనే పెద్దలు బ్రిటీష్ సామ్రాజ్యవాదులను దేశంనుండి వెళ్ళిగొట్టేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు. వారి మనకు సంపాదించి పెట్టిన స్వాతంత్య్ర ఫలాలను మనం సక్రమంగా సద్వినియోగం చేసుకొని భావిభారత పౌరులకు మార్గదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

గోకుల కృష్ణ గోపాలకృష్ణ

నయనానందకరంగా జన్మాష్టమి వేడుకలు
గుంటూరు (కల్చరల్), ఆగస్టు 15: గోకుల కృష్ణ, గోపాలకృష్ణ నీవే మా అందరినీ అన్ని వేళలా కాపాడవయ్యా అంటూ వేలాది మంది కృష్ణ భక్తులు నామసంకీర్తనలు చేస్తుండగా మూడు రోజుల పాటు జరిగే శ్రీ కృష్ణ జన్మాష్టమి కృష్ణ జయంతి మహోత్సవాలు గుంటూరులో మంగళవారం వైభవంగా ప్రారంభమైనాయి. నగరంలో ఉన్న రెండు ప్రధాన కృష్ణ మందిరాలు వీటన్నింటికీ తోడు గోవిందుడు కొలువైయున్న ఆలయాలు, దేవస్థానాలకు తెలతెలవారుతూనే భారీగా భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా గుంటూరువారితోటలోని శ్రీ గౌడీయమఠంలో కృష్ణ జయంతి మహోత్సవాలు శోభాయమానంగా జరిగాయి. 11 రకాల కర్పూర నీరాజనాలను అర్పించి మధ్యాహ్నం వేళ స్వామికి మహానివేదన గావించారు. శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన పాయసాన్ని (మధూకరం) నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందజేశారు. గౌడీయమఠ కార్యదర్శి శ్రీ భక్తిసుహృద్ మునిమహరాజ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు రాధాగోవింద భక్తులకు అమితంగా ఆకట్టుకున్నాయి.
ఇస్కాన్ మందిరంలో...
అంతర్జాతీయ కృష్ణ సేవా సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు మహా మంగళ హారతిని రాధాగోవిందుల పాలరాతి విగ్రహాలకు ఇస్కాన్ అర్చక బృందం సమర్పించింది. వరుసగా శృంగార హారతి పట్టారు. శ్రీమద్భాగవత ప్రవచనం, అఖండ హరినామ సంకీర్తనలు కొనసాగాయి. ఉత్సవంలో భాగంగా సాయంత్రం ఉట్టి ఉత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరిపారు. ఇలా ఉండగా ఆర్ అగ్రహారంలోని శ్రీ రామనామ క్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలను బృందావనంలో నిర్వహించే రీతిలో జరిపారు.