గుంటూరు

వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, ఆగస్టు 22: నవ్వాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం, శిక్షణ కేంద్రాన్ని, లెక్చర్ గ్యాలరీ, వైద్య విద్యార్థుల వసతి గృహాలను, వైద్యాధికారుల నివాస గృహాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా నడ్డా విలేఖర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత యిచ్చి, అవసరమైన ప్రాథమిక, వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తాడికొండలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య, శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. నీట్ వైద్య పరీక్షకు సంబంధించి 371-డి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున, కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భవనాలు గ్రామీణులకు బాగా ఉపయోగపడతాయని, 30 రోజుల పాటు వైద్యవిద్యార్థులు నూతన భవనంలో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారన్నారు. త్వరలో ఎఎంసిలో తరగతులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ట్రైనీ కలెక్టర్ స్వాప్నిక్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు వడ్లమూడి పూర్ణచంద్రరావు, ఆర్‌డిఒ శ్రీనివాసరావు, ఎంఎస్‌ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.