గుంటూరు

వచ్చే ఎన్నికలతో వైసిపి కనుమరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, సెప్టెంబర్ 19: అభివృద్ధికి అడుగడుగునా అడ్డం తగులుతూ ప్రజాదరణ కోల్పోతున్న వైకాపా 2019 అసెంబ్లీ ఎన్నికలతో పూర్తిగా కనుమరుగు అవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. యడ్లపాడు మండలం, మైదవోలు గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆయన సోమవారం నిర్వహించారు. జగన్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని ఆ పార్టీ నైజం ప్రజలకు అర్ధమైందన్నారు. అక్టోబర్ నెల నుండి గ్రామీణ మాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు, విజయవాడల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారని తెలిపారు. 25 శాతం సబ్సీడితో పేదలకు సరుకులు అందించే ఈ మాల్స్‌ను దశలవారీగా రాష్టవ్య్రాప్తంగా విస్తరించడం జరుగుతుందన్నారు. ఎన్నడూ లేనివిధంగా గత మూడు సంవత్సరాల కాలంలో మైదవోలు గ్రామంలో నాలుగు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలోని పలు ఇళ్లకు మంత్రి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరాతీశారు. నివేశన స్థలాలు, మంచినీటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
అభివృద్ధికి అడ్డంపడ్తున్న సర్పంచ్...
మైదవోలు గ్రామంలో మరింత అభివృద్ధి జరిగి ఉండేదని, వైసిపికి చెందిన పంచాయతీ సర్పంచ్ అడ్డుపడటం వలన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కోటి 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ సర్పంచ్ వాడకపోవడంతో మురిగిపోయాయన్నారు. కనీసం తన ఇంటి ముందు కూడా సిసి రోడ్డు వేసుకోలేని దుస్తితిలో సర్పంచ్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు పోపూరి శివరామకృష్ణ, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

వెయిట్ లిఫ్టర్ సాయిరేవతికి ఘన స్వాగతం

తెనాలి, సెప్టెంబర్ 19: కామన్‌వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు సాధించిన తెనాలి మండలం పెదరావూరు గ్రామవాసి, అంతర్జాతీయ క్రీడాకారిణి ఘట్టమనేని సాయిరేవతికి అభిమానులు, క్రీడాకాలు మంగళవారం రాత్రి ఘన స్వాగతం పలికారు. ఆమె విజయవాడ నుండి తెనాలికి ప్రత్యేక వాహనంలో వస్తున్నారని తెలుసుకున్న క్రీడాకారులు, అభిమానులు స్థానిక విఎస్‌ఆర్ అండ్ ఎన్‌విఆర్ కళాశాల సమీపం నుండి ప్రకాశంరోడ్, నెహ్రూరోడ్, బోస్‌రోడ్ మీదగా రామలింగేశ్వరపేటలోని కళ్యాణ మండపం వరకు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా భారతమాతాకుజై, క్రీడాకారిణి సాయిరేవతికి జై అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అనంతరం దుశ్శాలువాలు, పూలమాలలు, మెమోంటోలతో సాయి రేవతి, ఆమెకు శిక్షణ నిచ్చిన గురువును ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో పెదరావూరు, బుర్రిపాలెం గ్రామస్తులతోపాటుగా వివిధ గ్రామాల నుండి పెద్దసంఖ్యలో క్రీడాకారులు, అభిమానులు హాజరయ్యారు.