గుంటూరు

ప్రాథమిక దశలో ‘ఎయిమ్స్’ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, సెప్టెంబర్ 19: మంగళగిరి పట్టణం శివారులో పూర్వపు టీబీ శానిటోరియం ప్రాంగణం 193 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మమైన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభ మయ్యాయి. భవన నిర్మాణ పనులు ప్రాధమిక దశలో ఉన్నాయి. 2015 డిసెంబర్ 19వ తేదీన 1618 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణానికి మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి, ఆరోగ్యశాఖా మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, జెపి నడ్డా శంకుస్థాపన గావించారు. కేటాయించిన స్థలం చుట్టూ మూడువైపులా ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఇటీవలే పూర్తిచేశారు. నిర్మాణపనులు ప్రారంభం కాకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ పనులు ప్రారంభించింది. ప్రధానద్వారం, మిగిలి ఉన్న ప్రహరీగోడ పనులతో పాటు ఒక భవన నిర్మాణ పనికూడా ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు నిర్మాణ పనుల్లో ఉన్నారు. 900 పడకలు, వందమంది మెడికల్ విద్యార్ధులు, పారామెడికల్, పబ్లిక్‌హెల్త్ ఇన్‌స్టిట్యూషన్, రీసెర్చ్ విభాగం ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. జాతీయ రహదారినుంచి పూర్వపు జాతీయ రహదారి వరకు ఎయిమ్స్ ప్రాంగణంలో కనెక్టివిటీ రహదారి నిర్మాణం, అడ్డుగా ఉన్న విద్యుత్ స్థంభాల తొలగింపు పనులు మాత్రం ఏ కారణం చేతనో ప్రారంభం కాలేదు. వచ్చే ఏడాదినుంచి విజయవాడలో ఎయిమ్స్ తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇంటింటికీ టిడిపి - గడపగడపకూ వైసీపీ

మంగళగిరి, సెప్టెంబర్ 19: పట్టణంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ సీపీ పార్టీల శ్రేణులు పాదయాత్రలతో రాజకీయ సందడి నెలకొంది. ఇంటింటికీ టిడిపి, గడప గడపకూ వైసీపీ కార్యక్రమాలతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వివిధ వార్డుల్లో పాదయాత్రగా తిరుగుతున్నారు. మంగళవారం పట్టణంలోని 9వ వార్డులో జరిగిన ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మన్నవ సుబ్బారావు, ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి నాయకులు, కార్యకర్తలతో కలిసి అభివృద్ధి కరపత్రాలు ఇంటింటికీ అందజేసి ఆర్టీకి మద్దతు నివ్వాలని కోరారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, సంక్షేమ పధకాలను వివరించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని, ఏ ఇంటికి వెళ్లినా స్వాగతిస్తున్నారన్నారు. కౌన్సిలర్ ఉడతా శ్రీను, మాజీ ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ టిడిపి మీడియా ఇన్‌చార్జ్ గోవాడ రవి, పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎంవి మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నందం అబద్దయ్య, ఉద్దంటి పద్మావతి, దర్శి వనరాణి, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యాన మంగళవారం పట్టణంలోని 18వ వార్డులో గడప గడపకూ వైఎస్‌ఆర్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ప్లీనరీలో అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాల పధకాల కరపత్రాలను ఇంటింటికీ అందజేసి జగన్ నాయకత్వాన్ని బలపరచాలని, వైఎస్‌ఆర్ సీపీకి మద్దతివ్వాలని కోరారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, నేతలు ఆకురాతి రాజేష్, ఎండి ఫిరోజ్, ఉయ్యూరు వెంకటరెడ్డి, డి కోటేశ్వరరావు, బి నాగేశ్వరరావు, కె శ్రీనివాస్, కరీముల్లా, ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.