గుంటూరు

అంటువ్యాధులపై ప్రచారానికి ప్రత్యేక బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 19: జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరు నగరంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపించే వ్యాధులపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 53 బృందాలను నియమించినట్లు ఆమె చెప్పారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో బృంద సభ్యులతో సమావేశమైన కమిషనర్ పలు సూచనలు చేశారు. నగరపాలక సంస్థ మలేరియా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, మెడికల్ అండ్ హెల్త్ వారితో ప్రజలకు అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ బృందాలు స్లమ్ ఏరియాకు వెళ్లి నీరు నిల్వ ఉన్న చోట యాంటి లార్వ మెడిసిన్ వేయుట, పరిసరాలు శుభ్రం చేయడం, స్థానికంగా ఉన్న వారికి ఎవరికైనా జ్వరాలు ఉంటే రక్త నమూనాలు సేకరించి పరిశోధనకు పంపడం ఇతర సహాయక చర్యలు చేపడతారన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమ పర్యవేక్షణకు గాను 0863-2345105 నెంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్ టి రమేష్ మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు దోమలపై దండయాత్ర, సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం కేటాయించబడిన విధులకు వెళ్లే సిబ్బందితో గల బస్సుకు జెండా ఊపి కమిషనర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు, అదనపు కమిషనర్ కె రామచంద్రారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌లు ఎం ఏసుదాసు, శ్రీనివాసరావు, ఎంహెచ్‌ఒ శోభారాణి, బయాలజిస్ట్ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

అర్బన్‌లో 13 మంది ఎస్‌ఐల బదిలీలు
గుంటూరు, సెప్టెంబర్ 19: నగరంలో పలువురు ఎస్‌ఐలను బదిలీచేస్తూ రేంజి ఐజి గోపాలరావు మంగళవారు ఉత్తర్వులు జారీచేశారు. అటాచ్‌మెంట్‌పై పనిచేస్తున్న సిహెచ్ రాజశేఖర్‌ను తాడికొండ, విఆర్‌లో ఉన్న కె నాగేంద్రరావు కొత్తపేట, అరండల్‌పేట అటాచ్‌మెంట్‌లో ఉన్న కె ఆరోగ్యరాజు, సత్యనారాయణ పెదకాకాని పోలీసు స్టేషన్‌కు, అక్కడ అటాచ్‌మెంట్‌లో ఉన్న వి రంగారావు, పి ప్రేమయ్యలను అరండల్‌పేటకు బదిలీ చేశారు. ఐటి కోర్‌కు అటాచ్‌మెంట్‌లో ఉన్న జి కిరణ్‌బాబు నగరంపాలెం, ఆర్ నారాయణ మహిళా పోలీసుస్టేషన్‌కు, నగరంపాలెం పిఎస్‌లో పనిచేస్తున్న బి భార్గవ్ ప్రత్తిపాడు, అక్కడ పనిచేస్తున్న ఎస్ శ్రీనివాసరావు నగరంపాలెం, తాడేపల్లి ఎస్‌ఐ సిహెచ్ ప్రతాప్‌కుమార్ లాలాపేట, వట్టిచెరుకూరు ఎస్‌ఐ డి అశోక్ తాడేపల్లికి, లాలాపేట పిఎస్‌లో అటాచ్‌మెంట్‌లో ఉన్న సిహెచ్ కృష్ణారెడ్డిని వట్టిచెరుకూరు ఎస్‌ఐగా నియమితులయ్యారు.

లారీ కిందపడి తాపీ మేస్ర్తీ మృతి
సత్తెనపల్లి, సెప్టెంబర్ 19: ప్రమాదవశాత్తు లారీ వెనుక టైరు కింద పడి తాపీ మేస్ర్తీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి-పిడుగురాళ్ళ మధ్యలోగల ఈద్గా వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సత్తెనపల్లిలో పనులు ముగించుకొని టివిఎస్ మోపెడ్‌పై దూళిపాళ్లలోని భాగ్యనగర్‌కు చెందిన చిలుకా యేసోబు (46) ఇంటికి వెళుతున్నాడు. ఈద్గా వద్దకు రాగానే అదేమార్గంలో పిడుగురాళ్ళ వైపు వెళుతున్న లారీ వెనుక టైరు టివిఎస్ వాహనానికి తగలడంతో యోసోబు వాహనం అదుపుతప్పడంతో లారీ వెనుక టైరు కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో అతని కుడికాలు తొడ భాగంపైనవున్న చర్మం కండతో సహా పూర్తిగా విడిపోయింది. దీనితో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య చిలుకా జయమ్మ ఇచ్చిన పిర్యాదుమేరకు సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.