గుంటూరు

బౌద్ధంతో పునీతమైన అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 21: బౌద్ధ ధర్మం, బోధనలతో కృష్ణానది పరివాహక ప్రాంతమైన అమరావతి ఏనాడో పునీతమైందని, తిరిగి ఈ నేలకు పూర్వవైభవం రావాల్సిన అవసరం మరింతగా ఉందని ప్రముఖ చరిత్రకారుడు వావిలాల సుబ్బారావు ఆకాంక్షించారు. జెకెసి కళాశాల వేదికగా కేంద్ర సాహిత్య అకాడమి, బెంగళూరు దక్షిణప్రాంత శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న గౌతమబుద్ధుడు, తెలుగు సాహిత్య సాంస్కృతిక ప్రతిఫలణం ముగింపు సభ గురువారం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలువురు సాహితీవేత్తలు, పరిశోధకులు విద్యావేత్తలు విభిన్న అంశాలపై తమ అనోభావాలను అభివ్యక్తీకరించారు. వావిలాల తన అధ్యక్షోపన్యాసంలో ఆచార్య నాగార్జునుడి కవిత్వం, తత్వం అనే అంశంపై అర్ధవంతమైన ప్రసంగాన్ని అందించారు. చల్లపల్లి స్వరూపరాణి బుద్ధుడు - అంబేద్కరం అనే అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తంచేస్తూ భారతరత్న అంబేద్కర్‌ను అమితంగా ఆకట్టుకుని, ప్రభావితం చేసింది కూడా బౌద్ధ్ధర్మమేనన్నారు. ముగింపు సభకు ఆచార్య ఎన్ గోపి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ బుద్ధ భగవానుడి బోధనలు మానవులందరికీ శిరోధార్యమన్నారు. సమీక్ష చేసిన అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఈ రెండు రోజుల సదస్సు బౌద్ధ్ధర్మం, పునర్వికాసానికి అమరావతి ప్రాభవ వైభవాలను చాటిచెప్పడానికి ఉపయోగపడగలదన్న ఆశాభావం వ్యక్తంచేశారు. పలువురు సాహితీవేత్తలు అనేక అంశాలపై ప్రసంగించి పత్రాలు సమర్పించారు. అకాడమి ప్రాంతీయ కార్యదర్శి ఎస్‌పి మహాలింగేశ్వర్, తెలుగు సలహామండలి సభ్యులు డాక్టర్ పాపినేని శివశంకర్ తదితరులు వక్తలను అభినందించారు.

ఆధునిక తెలుగు కవులలో జాషువాకు విశిష్ఠ స్థానం

* ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

గుంటూరు (పట్నంబజారు), సెప్టెంబర్ 21: ఆధునిక తెలుగు కవులలో జాషువాకు విశిష్ఠమైన స్థానం ఉందని, తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై పోరాడిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ కొనియాడారు. మహాకవి గుర్రం జాషువ 121 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం స్థానిక కలెక్టరేట్ రోడ్డులోని కన్న వారితోట వద్ద గల గుర్రం జాషువ విగ్రహం నుండి పాదయాత్రను వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రం జాషువ గుంటూరు జిల్లాలో జన్మించడం గర్వకారణంగా ఉందని, జాషువ 122వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 22 నుండి 28 వరకు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్థానిక వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో జరిగే పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభిస్తారని తెలిపారు. చివరిరోజైన 28న జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాదా రాధాకృష్ణమూర్తి, విల్సన్, బత్తుల వీరాస్వామి, పద్మశ్రీ, మూర్తిదేవి పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, నూతక్కి దశరధ, ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.