గుంటూరు

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు మటుమాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 21: పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ పేర్కొన్నారు. స్వచ్చతే సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనూరాధ మాట్లాడుతూ స్వచ్చతే సేవ కార్యక్రమంలో భాగంగా కార్యాలయాన్ని శుభ్రం చేసినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ సిబ్బంది కార్యాలయాల్లోని గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలు ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలను రోడ్లపై, కాల్వల్లో పడవేయకుండా తడి, పొడి చెత్తలను విభజించి నగరపాలక సంస్థ సిబ్బందికి అందజేయాలన్నారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయని, దీంతో అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఎంహెచ్‌ఒ శోభారాణి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.

బాలాత్రిపురసుందరిగా కరుణించిన జగదాంబ

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 21: ‘శ్రీ విద్యాం, త్రిపురేశ్వరీం, పార్వతీం, భువశ్వరీం, బాలా, కామేశ్వరీ చైవ, గాయత్రీం, కమలాసంభవ’ అని ఏనాడో ముక్కోటి దేవతలు, మహర్షులు ఈ కలియుగాన ఆధ్యాత్మిక లోక తొలి జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల చేత జగదంబ కీర్తించబడింది. ఇది లోక విధితమే. జగద్ధాత్రి శ్రీ బాలాత్రిపుర సుందరిగా గురువారంనాడు దివ్యదర్శనాన్ని భక్తజనానికి అనుగ్రహించింది. ఆశ్వీయుజ శుద్ధపాడ్యమి గురువారం (లక్ష్మీవారం) తెలతెలవారుతూనే అన్ని ఆలయాలు, హైందవ ధర్మాన్ని సదా గౌరవించే గృహాలలో దసరా నవరాత్రి మహోత్సవాలు వేడుకగా, సంప్రదాయబద్ధంగా ప్రారంభమైనాయి. నగరంలోని 52 డివిజన్లలో, నలుమూలలా ఉన్న ప్రాంతాల్లో అన్ని శక్తిమందిరాలు, ఆలయాల్లో అర్చన, పూజ, కైంకర్యం, మహానివేదనలు జరిగాయి. గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించి రుత్విక్కులు, వేద పండితులకు పట్టువస్త్రాలను దీక్షగా సమర్పించారు. ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం, అరండల్‌పేటలోని అష్టలక్ష్మీ మందిరం, సిద్దార్ధనగర్ శ్రీ కనకమహాలక్ష్మి మందిరం, బృందావన వెంకన్న ఆలయం, మల్లిఖార్జునపేటలోని శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి దేవస్థానం, అమరావతి రోడ్డు వీరాంజనేయస్వామి వారి ఆలయం, వికాస్‌నగర్‌లోని శ్రీ షిరిడిసాయిమందిరంలో, సంపత్‌నగర్ అయ్యప్ప దేవాలయం వద్ద గల శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, పండరీపురం శ్రీ కోదండరామ మందిరం, రవీంద్రనగర్, పట్ట్భాపురం, కంచికామకోటి పీఠ క్షేత్రం, మారుతినగర్ మారుతీక్షేత్రం తదితర అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలలో తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరిగా అలంకృతురాలై భక్తుల మనోభీష్టాన్ని నెరవేర్చడానికి నేనున్నానంటూ అభయమిచ్చింది.