గుంటూరు

అణుబాంబులు కాదు... మానవాళి మనుగడే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 21: ‘మమతాచేలలో సమతా పూబంతులను పెంచి, నవ్యత, దివ్యత కల్గిన నవప్రపంచాన్ని నిర్మిద్దాం, భావితరానికి బంగారు భవిష్యత్తును అందిద్దామంటూ ప్రపంచశాంతికై వివిధ దేశాల నుంచి తరలివచ్చిన 125 మంది కవులు, కవయిత్రులు ఒక్కటై గళమిప్పారు. గుంటూరులోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల వేదికగా ఆ విద్యాసంస్థ ఆంగ్ల శాఖ ఆధ్వర్యాన పదవ అంతర్జాతీయ కవితాగాన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ కె బసవపున్నయ్య అధ్యక్షత వహించగా పాలకవర్గ కార్యదర్శి జాగర్లమూడి మురళీమోహన్, ప్రిన్సిపల్ ఐ నాగేశ్వరరావు, డైరక్టర్ ఎస్‌ఆర్‌కె ప్రసాద్, ఈ ఉత్సవ సమన్వయకర్తలు డాక్టర్ పరుచూరి గోపిచంద్, పి నాగసుశీల జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కవితా మనోభావాల గోష్ఠిని ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా కేంద్రప్రభుత్వ తంతితపాల శాఖ ప్రత్యేకంగా ప్రచురించిన స్టాంప్‌ను ప్రాంతీయ పోస్టల్ అధికారి డి సత్యనారాయణ, ఇతర అతిథులతో కలిసి విడుదల చేశారు. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ శాంతికై గుంటూరులో 10వ అంతర్జాతీయ కవితా సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం ఎంతైనా ముదావహమని, ఇది దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, మలేషియా, శ్రీలంక, మారిషష్ తదితర సుదూర ప్రాంతాల నుండి కూడా ఉత్సాహంగా కవులు, కవయిత్రులు, భాషావేత్తలు విచ్చేశారు. అణ్వాయుధాలు, తీవ్రవాదం విపరీతమై మానవాళి మనుగడను సవాల్ చేస్తున్న నేటి పరిస్థితుల్లో అణుబాంబులు కాదు కావాల్సింది, ఆత్మీయతానురాగాలు పెంపొందించే మానవత్వ సమానత్వ సమాజం కావాలని, అటువంటి విశ్వశాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ భుజం భుజం కలపాలని ఈ ఉత్సవం పిలుపునిచ్చింది. 48 మంది సాహితీవేత్తలు రచించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.

అశ్వమేధ యజ్ఞానికి ప్రచార రథాలు రెడీ

మంగళగిరి, సెప్టెంబర్ 21: మండలంలోని చినకాకానిలో గల ఎన్నారై వైద్య కళాశాల ప్రాంగణంలో అఖిల విశ్వ గాయత్రీ పరివార్, శాంతికుంజ్, హరిద్వార్ వారి సారధ్యంలో 2018 జనవరి 5 నుంచి 8 వరకు జరగనున్న అశ్వమేధ గాయత్రీ మహా యజ్ఞం విజయవంతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు అశ్వమేధ శక్తి కలశ రథ తీర్ధయాత్ర పేరిట రెండు ప్రచార రథాలను గురువారం గౌతమీ మహర్షి పర్ణశాల నుంచి ప్రారంభించారు. గాయత్రీ పరివార్ ప్రతినిధులు, ఎన్నారై సైనె్సస్ అకాడమీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి చేరుకుని పూజల అనంతరం రెండు రథాలు బయలుదేరి వెళ్లాయి.

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

రొంపిచర్ల, సెప్టెంబర్ 21: రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకుని ప్రజలు అభివృద్ధి చెందాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మండలంలోని తుంగపాడులో గురువారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో తుంగపాడు గ్రామంలో 4 కోట్ల రూపాయల విలువైన పనులను చేపట్టామన్నారు. 37 లక్షల రూపాయల విలువ గల పనులను ఈ రోజున ప్రారంభించామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను కలిపిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. తొలుత గ్రామంలో వీధివీధి తిరిగిన కోడెల వ్యవసాయ శాఖ అధికారులు, శాస్తవ్రేత్తలు ఏర్పాటుచేసిన సహజసిద్ధ ప్రకృతి వ్యవసాయ దుకాణాన్ని ప్రారంభించారు.