గుంటూరు

29న అత్యంత పకడ్బందీగా ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 26: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈనెల 29వ తేదీన ఎంసెట్ పరీక్షలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్షరెన్స్‌లో 13 జిల్లాల కలెక్టర్‌లు, పోలీసు అధికారులు, ఎంసెట్ కోఆర్డినేటర్లు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. ఎంసెట్‌కు రాష్ట్రంలో 2,92,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. వారి కోసం 500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 29వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు వ్యవసాయ, మెడికల్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయన్నారు. పరీక్షా పేపర్లు ఈనెల 27వ తేదీకి జిల్లా కేంద్రానికి చేరుతున్నందున వాటిని ట్రెజరీ లేక, పోలీసు స్ట్రాంగ్‌రూమ్‌లో అత్యంత భద్రంగా ఉంచాలన్నారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరేలా ఆర్టీసీ తగినన్ని బస్సులను నడపాలని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. పరీక్షల సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టంచేశారు. పరీక్షలు జరిగే రోజు, ముందురోజు జిరాక్సు, ఇంటర్నెట్ దుకాణాలను మూయించి వేయాలన్నారు. వచ్చే నెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 5 కేంద్రాల్లో జరగనున్నాయని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, గుంటూరులలో జరగనున్నందున ఆ పరీక్షలు కూడా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు ఎంసెట్ పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై మంత్రికి వివరించారు. ఉప రవాణా కమిషనర్ రాజారత్నం, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి టి పద్మజారాణి, ఎంఎట్ జిల్లా కో ఆర్డినేటర్ సిద్దయ్య, గుంటూరు నగరపాలక సంస్థ ఉప కమిషనర్ ఏసుదాసు పాల్గొన్నారు.