గుంటూరు

గ్రామదర్శినితో సమస్యలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 23: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అలసత్వం ప్రదర్శించరాదని కలెక్టర్ కోన శశిధర్ స్పష్టం చేశారు.శని వారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని డిఆర్‌సి సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల విజయవాడ లో జరిగిన కలెక్టర్ల సదస్సు లక్ష్యాలను ముందుగా వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు విషయంలో రాజీపడవద్దని అధికారులకు సూచించారు. నూరుశాతం లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని కోరారు. ఉద్యానవనశాఖ పరిధిలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకంతో రైతులకు ఆదాయాన్ని పెంచే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పట్టు పరిశ్రమ, మల్బరీ తోటల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. పల్నాడు ప్రాంతంలో 15 మండలాల్లో భూగర్భజల వనరులను పర్యవేక్షించి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో 15 రోజుల్లోగా నర్సరీలను ప్రారంభించాలన్నారు. ఖాళీగా ఉన్న చౌకడిపో డీలర్ల పోస్టులను నెలరోజుల్లోగా భర్తీ చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రతి కార్యాలయంలో ఈ ఆఫీస్ విధానాన్ని విధిగా నిర్వహించాలన్నారు. మీకోసం 1100కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యా సంస్థలలో బయోమెట్రిక్ విధానం ద్వారా నూరుశాతం విద్యార్థుల హాజరును పర్యవేక్షించాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా అధికారులతో వారానికి ఓ గ్రామాన్ని సందర్శించాలని కలెక్టర్ నిర్ణయించారు. తనతో పాటు అధికారులు సంబంధిత గ్రామంలో ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించాలని నిర్దేశించారు. సమావేశంలో జెసి కృతికా శుక్లా, డిఆర్‌ఒ కె నాగబాబు, ప్రణాళికాశాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం

వేమూరు, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖామంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం సాయంత్రం బూతుమల్లి గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆనందబాబు పాల్గొన్నారు. ఇంటింటికి మంత్రి తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ చిన్నారులను పలుకరిస్తూ, వికలాంగులు, వృద్ధులకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రతీ పేదవాని కుటుంబంలో చంద్రబాబునాయుడు పెద్దకొడుకుగా ఉంటాడని ఆద్యంతం అభిమానులు, పార్టీ కార్యకర్తల ఆనందోత్సహాల మధ్య ర్యాలీ సాగింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పూర్తిస్థాయి సంస్కరణలు జరిగాయన్నారు. ఈ కారణంగానే భారతదేశంలో అనేక అవార్డులు విద్యుత్ శాఖ పొందిందన్నారు. దేశంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా 24 గంటలు ప్రజలకు, రైతులకు విద్యుత్‌ను అందుతోందన్నారు. దళితులకు 50 యూనిట్లవరకు గతంలో ఉచితం ఉండగా ప్రస్తుతం నెలకు 75 యూనిట్లవరకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆజీవోను తన శాఖద్వారా అందించటం ఆనందంగా ఉందన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఈ ఏడాది సాగర్‌లో నీరు లేకున్నా నదుల అనుసంధానంతో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు డెల్టా ప్రాంతానికి సాగునీరు రావటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతాంగం వరినాట్లు వేసుకోవటం శుభపరిణామం అన్నారు. రైతులకు రుణమాఫీ చేయటం ద్వారా రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారన్నారు. రానున్న ఏడాదిన్నర కాలంలో ప్రతి పేదవానికి పక్కా గృహాలు, 13 జిల్లాలలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందించటమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. బూతుమల్లిదళిత వాడలో తాగునీరు సౌకర్యం లేదని మహిళలు మంత్రికి విన్నవించగా 5 లక్షల నిధులు మంజూరుచేసినట్లు ప్రకటించారు. మంత్రికి దళితవాడలో పూలతో ఘన స్వాగతం లభించింది. తొలుత ఎన్‌టిఆర్ విగ్రహానికి మంత్రి పూలమాలలువేశారు. వేమూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కృష్ణాపశ్చిమ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మైనేని మురళీకృష్ణ, ఎంపిపి రాఘవరావు, నాయకులు గాజుల కృష్ణమూర్తి, మిర్యాల జాన్ రాజేంద్రబాబు, ఎంపిటిసి గోగినేని కేశవరావు, బూతుమల్లి సుబ్బారావు, తుమ్మల మదన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణగా అభయమిచ్చిన పార్వతీదేవి

గుంటూరు (కల్చరల్),సెప్టెంబర్ 23: ‘అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై’ అనే శ్లోకాన్ని పఠిస్తూ వేలాదిమంది భక్తులు అమ్మవారి నామ స్మరణ చేసుకుంటూ నగరంలోని శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న దేవీ ఆరాధనా మందిరాలకు భక్తిశ్రద్దలతో మూడవరోజైన శనివారం తరలివచ్చారు. అరండల్‌పేటలోని హంపీ విరూపాక్ష పీఠానికి దత్తత చేయబడిన శ్రీ అష్టలక్ష్మీసమేత లక్ష్మీనారాయణ మందిరంలో అన్నపూర్ణా దేవిగా లక్ష్మీ మూర్తులు పూజలు అందుకున్నారు. సిద్ధార్థనగర్ కనకమహాలక్ష్మీ దేవాలయం, బృందావన్ గార్డెన్స్ వెంకన్న ఆలయం, అమరావతి రోడ్డు శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం, వికాస్‌నగర్ శ్రీ షిరిడీ సాయి మందిర్, పండరీపురం శ్రీ కోదండరామమందిరం, మారుతీనగర్ మారుతీ క్షేత్రం, పట్ట్భాపురం హరిహరదత్తక్షేత్రం, బ్రాడీపేట సిద్ధేశ్వరీ పీఠ ఓంకారక్షేత్ర తదితర ఆధ్యాత్మిక మందిరాల్లో సౌందర్య రత్నాకరి అయిన జగన్మాత శ్రీ అన్నపూర్ణాదేవిగా సర్వాభరణాలతో అలంకృతురాలై భక్తులను అనుగ్రహించింది. కాగా కోస్తాంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయమైన ఆర్ అగ్రహారం అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ చండీదేవిగా విశేష పూజలు అందుకున్నారు. సంగడిగుంట సీతారామాంజనేయస్వామి దేవాలయంలో శ్రీ సంతానలక్ష్మిగా, కృష్ణనగర్ శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో మహాలక్ష్మి దేవిగా మల్లికార్జునపేట శ్రీ బృందావన భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో గాయత్రీదేవిగా, పాతగుంటూరులోని పలు దేవాలయాలు, కొత్తపేట శివాలయం తదితర దేవస్థానాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు పరాశక్తి వైభవానికి ప్రతీకగా కొనసాగుతున్నాయి.

నేత్రపర్వంగా శరన్నవరాత్రులు

మంగళగిరి, సెప్టెంబర్ 23: పట్టణంలోని వివిధ దేవాలయాల్లో హేవళంబి నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తుల కన్నుల పండువగా జరుగుతున్నాయి. శనివారం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శన మిచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారికి ధాన్యలక్ష్మి అలంకారం, కోర్టు ఎదుట గల అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గాయత్రీ అలంకారం, ఘాట్‌రోడ్డు మార్గంలోని పద్మావతీ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ధాన్యలక్ష్మీ అలంకారం, బైపాస్ రోడ్డులో గల కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి గాయత్రీ అలంకారం, రాజీవ్ గృహకల్ప రోడ్డుల గల కాళీమాతా అమ్మవారికి గాయత్రీదేవి అలంకారం, పెదకోనేరు వద్ద గల దుర్గ్భావాని ఆలయంలో అమ్మవారికి కన్యకా పరమేశ్వరి అలంకారం, హుస్సేన్ కట్ట వద్దగల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గాయత్రీదేవి అలంకారం, మెయిన్ బజార్‌లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గజలక్ష్మీ అలంకారం చేశారు.