గుంటూరు

మహాలక్ష్మీదేవిగా బాలచాముండిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 24: శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక అమరేశ్వరాలయంలో బాలచాముండికా అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమరేశ్వరాలయంలో చండీహోమం, లక్ష కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 24వ శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం వాసవీమాతను వేదమాత గాయత్రిదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు బతకమ్మ అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేసి, ఆటపాటలతో అమ్మవారి ఉత్సవం ఘనంగా జరిపారు. అలాగే వడియరాజుల కాలనీలో ఏర్పాటుచేసిన జగన్మాత కనకదుర్గాదేవి విగ్రహానికి వేపమండలతో విశేషంగా అలంకరించి అమ్మవారికి పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు.

క్రీస్తుప్రేమను పంచిన విశ్వనరుడు జాషువ
గుంటూరు (పట్నంబజారు), సెప్టెంబర్ 24: క్రీస్తు బోధించిన విశ్వ మానవత్వం, క్షమాగుణం పునికి పుచ్చుకున్న మహాకవి జాషువ తన కవితల ద్వారా అసమానతలపై అక్రోశాన్ని వెళ్లగక్కగా తిరిగి క్షమాగుణంతో లోకాన్ని ప్రేమించిన విశ్వనరుడు గుర్రం జాషువా అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్ అన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సారధ్యంలో జాషువ కళాపీఠం ఆధ్వర్యాన జాషువ 122వ జయంతి వేడుకల్లో భాగంగా 3వ రోజైన ఆదివారం క్రీస్తు చరిత్రలో మానవతాబోధనలు అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పుష్పరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వ సమానత్వం కోసం జీవితకాలం కలంతో జాషువ రచనలు సాగించారన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చర్చాగోష్టికి అధ్యక్షత వహించగా ఎపి ట్రాన్స్‌కో అధికారి రవిశేఖర్, దళిత సంఘాల నాయకులు అత్తోట జోసఫ్, నూతక్కి దశరధలు పాల్గొన్నారు. కాకినాడ కళాకారులు కవికోకిల జాషువ నాటకంతో సభికులను అలరించారు.