గుంటూరు

డెంగ్యూతో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజెండ్ల, సెప్టెంబర్ 24 : డెంగ్యూ జ్వరంతో ఓ మహిళ మృత్యువాత పడిన సంఘటన మండలంలోని కొండలరాయునిపాలెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మైలవరపు లాలమ్మ (36) గత వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. స్థానిక వైద్యులు చికిత్స చేసినప్పటికీ జ్వరం అదుపులోకి రాలేదు. దీంతో ప్రకాశం జిల్లా అద్దంకికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు భర్త హుస్సేన్ తెలిపారు. డెంగ్యూ జ్వరమే లాలమ్మ మృతికి కారణమని అక్కడి వైద్యులు చెప్పారని హుసేన్ అన్నారు. మృతురాలికి భర్తతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు.

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
యడ్లపాడు, సెప్టెంబర్ 24: యడ్లపాడు మండలం, ఉన్నవ గ్రామానికి చెందిన గొట్టం నాగరాజు (19) అనే యువకుడు ఆదివారం నేలబావిలో ఈతకు దిగి చనిపోయాడు. బావి అడుగున పూడికలో కూరుకుపోవడంతో బయటకు రాలేక నాగరాజు మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఇతనితో పాటు ఈతకు వెళ్లిన మరో ఐదుగురు స్నేహితులు ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పడంతో గ్రామస్థులు బావి వద్దకు వెళ్లి నాగరాజు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా నాగరాజు తండ్రి పోతురాజు ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయారు. నాగరాజు చిలకలూరిపేటలోని ఎఎంజి కళాశాలలో ఐటిఐ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. నాగరాజు దుర్మరణం ఉన్నవ గ్రామంలో విషాద వాతావరణం నెలకొల్పింది. ఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.