గుంటూరు

అవసానదశలో సాగర్ ఆయకట్టు సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర్ల, సెప్టెంబర్ 24: సాగర్ ఆయకట్టు పరిధిలో సాగు అవసానదశలో ఉందని ఆలిండియా కిసాన్‌సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన రైతు సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగర్ పరిధిలో మూడు వంతులు వరితో మిగిలిన భాగం వాణిజ్య పంటలతో కళకళలాడే భూములు నేడు కళావిహీనంగా మారాయన్నారు. సుబాబుల్‌సాగు పెరిగిందన్నారు. అపరాలు వేయండి, అధిక లాభాలు పొందండి అని సర్కారు చెబితే విని వాటిని సాగు చేసిన రైతులు మార్కెట్ లూటీతో భారీ మూల్యం చెల్లించుకున్నారన్నారు. మిర్చి పంట నష్టం రైతులకు నషానాకి అంటిందన్నారు. ఖరీఫ్‌లో పెసర, మినుము, సాగు చేసిన వారికి కన్నీరే మిగిలాయన్నారు. మినుము ధర క్వింటా కేవలం 1500 రూపాయలు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది సాగర్‌కు సరిపడినంత నీరు వచ్చినా సాగుకు నీరు ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది పరిస్థితి ఏమిటో అర్ధంకాకుండా ఉందన్నారు. దయాదాక్షిణ్యాలు, రాజకీయ అవసరాల ప్రాతిపదికగా సాగునీటి విడుదల ఉండకూడదన్నారు. సాగు జరగనందున పంటకు పూర్తినష్టం ప్రభుత్వం చెల్లించాలన్నారు. సాగర్ ఆయకట్టు సమస్యపై అనుభవాల ప్రాతిపదికగా సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. రైతాంగం రుణాల ఊబిలో ఎందుకు కూరుపోతున్నది, ఆత్మహత్యల పరంపర ఎందుకు సాగుతోంది, రుణాలు, సబ్సీడిలు రైతులకు ఏ మేరకు ఇచ్చారు, పంటల బీమా పథకం సంగతేంటి, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు, రుణాల మంజూరు కబుర్లకే పరిమితమా, స్వచ్చాంధ్ర-మరుగుదొడ్ల వినియోగం ఎలా ఉందంటూ సర్వేలు జరుపుతున్నారు కానీ వ్యవసాయరంగం, రైతు, పేదల పరిస్థితిపై సర్వే ఎప్పుడు జరుపుతారని ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి వ్యవసాయరంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి ఆంజనేయరెడ్డి, మెట్టు కోటిరెడ్డి, పచ్చవ రామారావు, రామకృష్ణంరాజు, శేషంరాజు, ఎస్‌వి రాజు తదితరులు పాల్గొన్నారు.