గుంటూరు

మూడేళ్లలో రూ.928 కోట్ల అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, సెప్టెంబర్ 25: గత మూడు సంవత్సరాలలోనే నియోజకవర్గంలో 928 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎపి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. సోమవారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని మండలంలోని కోటనెమలిపురి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో మూడున్నర సంవత్సరాలలోనే అభివృద్ధి జరిగిందన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలంలోని కోటనెమలిపురి గ్రామంలో జోరువానలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కోటనెమలిపురి గ్రామంలోనే 6.55 కోట్ల పనులను చేపట్టడం జరిగిందని, ఒక్క రోజులోనే 1.85 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇళ్లులేని నిరుపేదలు ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ స్కీంను వినియోగించుకోవాలన్నారు. గ్యాస్ కనెక్షన్లు, రుణమాఫీ, ఆర్వో ప్లాంట్లు, ఎల్‌ఇడి బల్బులను, వ్యవసాయ ట్రాక్టర్లు, పరికరాలను అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం కేవలం ఓట్లు వేయించుకోవాలన్న తపన తప్ప ప్రజలకు పనిచేయాలన్న ఆలోచన చేయలేదని స్పీకర్ కోడెల అన్నారు. ఎవరైనా గ్రామంలో గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఏ పార్టీ వారినైనా సహించవద్దని అన్నారు. పంచాయతీ పరిధిలోనే వీరమ్మ కాలనీ, టిఎన్ కాలనీల్లో రావాల్సిన పట్టాలను కూడా ఇచ్చేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అంచుల నరసింహారావు, యార్డు చైర్మన్ పూజల వెంకట కోటయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్రా బాబురావు, సొసైటీ చైర్మన్ అనంతలక్ష్మి శ్రీనివాసరెడ్డి, నాయకులు సానికొమ్ము కోటిరెడ్డి, హుస్సేన్‌రెడ్డి, వర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పురుగు మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య
ప్రత్తిపాడు, సెప్టెంబర్ 25: అప్పులు తీర్చే దారీలేక ఓ కౌలు రైతు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... మండలంలోని చినకోండ్రుపాడు గ్రామానికి చెందిన నాయుడు శ్రీనివాసరావు (47) 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా ఎలాంటి రాబడి లేకపోవడంతో, చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఎలాగైనా చేసిన అప్పులు తీర్చుదామన్న ఉద్దేశంతో ప్రయత్నించగా అందులోనూ నష్టం రావడంతో ఈనెల 23న రాత్రి క్రిమి సంహారక మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి తాడేపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్‌ఐ బి భార్గవ్ తెలిపారు.
రహదారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
చిలకలూరిపేట, సెప్టెంబర్ 25: రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి పుల్లారావు బైపాస్ రోడ్ ఆర్చి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన పుల్లారావు మాట్లాడారు. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే రహదారులను, బైపాస్‌రోడ్లను, నాణ్యతా ప్రమాణాలు పాటించి పూర్తి చేస్తుందన్నారు. రాష్ట్భ్రావృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నిడమానూరు సాంబశివరావు, అల్లాభక్షు, రిజ్వాన్, కంచర్ల శ్రీనివాసరావు, ఆరె మల్లిఖార్జునరావు, బిజెపి నాయకులు పోట్రు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.