గుంటూరు

మంగళగిరిలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, సెప్టెంబర్ 25: పట్టణంలో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. గౌతమబుద్ధ రోడ్డులో వర్షపునీరు, మురుగునీరు రోడ్డుపై చేరి ప్రవహించడంతో రోడ్డు వాగును తలపించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా మారడంతో వర్షం పడిన ప్రతిసారీ ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. కోట్లు రూపాయలు వెచ్చించిన డ్రైనేజీలు ఉపయోగం లేకుండా పోయాయి.
ఘనంగా జాషువా జయంతి
వినుకొండ, సెప్టెంబర్ 25 : స్థానిక జాషువా కళాకేంద్రం, ప్రజానాట్యమండలి, కెవీపియస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాషువా విజ్ఞాన కేంద్రం జిల్లా కార్యదర్శి నూతలపాటి కాళిదాసు మాట్లాడుతూ జాషువా కవిత్వం ప్రజల నాలుకల మీద జనరంజకంగా కదలాడుతుందని. కుల, మత, దురహంకారాలను తన పద్యాల ద్వారా ఎండగట్టిన మహాకవి జాషువా అని కొనియాడారు. సహజకవి దుబ్బలదాసు, కవి కరిముల్లా మాట్లాడుతూ జాషువా కవిత్వంలోని కమనీయ అనుభూతిని వివరించారు. జాషువా సాంస్కృతిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జాన్ సుందరరావు, కమలారామ్, సిపిఎం నాయకులు కె హనుమంతరెడ్డి, కొండయ్య, కుంజరి ఏసు తదితరులు పాల్గొన్నారు.
నాన్‌స్టాప్ సర్వీసుగా సచివాలయం బస్సు నడపాలి
తాడికొండ, సెప్టెంబర్ 25: గుంటూరు వన్ డిపో మేనేజర్ మల్లిఖార్జునరెడ్డి, సిటిఒ వాణిశ్రీ సచివాలయం ఉద్యోగులపై నిరంకుశంగా వ్యవరిస్తూన్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సచివాలయం ఉద్యోగ సంఘాలు అగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిధిలోని తాడికొండ అడ్టరోడ్ సెంటర్‌లో ఎపియస్‌ఆర్‌టిసి అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. అంతడితో ఆగకుండా అడ్డరోడ్ సెంటరు నుండి సచివాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా సచివాలయం ఉద్యోగుతు విలేఖర్లతో మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగులకు వేసిన నాన్ స్టాప్ ఆర్‌టిసి బస్సును ఆర్డినరీగా మార్చడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. డిపొ మేనేజరు మల్లికార్జునరెడ్డి, సిటిఒ వాణిశ్రీ రెండు నెలలుగా ఈ బస్సును ఆర్డినరీ బస్సుగా కేటాయించడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడవలసి వస్తుందని అవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అర్‌ఎం యధావిధిగానే బస్సులు నడుపుతామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
క్రికెట్ బుకీల అరెస్టు
గుంటూరు, సెప్టెంబర్ 25: అర్బన్ జిల్లా పరిధిలో సోమవారం ఎస్‌పి సిహెచ్ విజయారావు ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు జరిపి క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ డిఎస్‌పి పి శ్రీనివాస్ పర్యవేక్షణలో అరండల్‌పేట సిఐ వై శ్రీనివాసరావు, ఎస్‌ఐ షేక్ నాగూర్ మీరా సాహెబ్, సిబ్బంది దాడులు నిర్వహించి 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక టివి, 14 సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి విజయారావు వివరించారు. నాగిరెడ్డి నర్సిరెడ్డి, గుండా అశోక్‌కుమార్, తెడ్ల శేషుకుమార్, టి నిరంజన్‌రెడ్డి, పావులూరి శ్రీకాంత్, బందెల భానుకిరణ్, పి రాజేష్‌బాబు, కె సుబ్బారెడ్డిని అరెస్టుచేసి కేసు నమోదు చేశారు.