గుంటూరు

శివారు గ్రామాలకు తాగునీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 12: ఇకపై జిల్లాలోని ప్రతి శివారు గ్రామానికి మంచినీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1739 గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు రూ. 3761 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. గురువారం జలవనరులశాఖ కార్యాలయంలో కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్, కోన రఘుపతి, జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్‌తో పాటు అధికారులతో మంచినీటి విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, పారిశుద్ధ్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి మనిషికి మంచినీటిని అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రతి మనిషికి సగటున తన అవసరాల కోసం 70 లీటర్ల నీరు అవసరమవుతుందని 13 జిల్లాల్లో అందుకు తగ్గట్టుగా నీరు పంపిణీ చేసేందుకు రూ. 10వేల కోట్లతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1739 శివారు గ్రామాలకు గాను 612 గ్రామాలకు పూర్తిస్థాయిలో నీరు అందుతోందని 128 గ్రామాల్లో 0.01 నుండి 13.75లీటర్ల నీటిని, 13.76 నుండి 27.5 లీటర్ల వరకు 215 గ్రామాలకు 27.51 నుండి 41.25 లీటర్ల నీటిని 355 గ్రామాలకు 41.26 నుండి 54.99 లీటర్ల నీటిని 412 గ్రామాలకు సరఫరా చేస్తుండగా 17 గ్రామాలకు పూర్తి స్థాయిలో నీటిని అందించాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 32.79 లక్షల జనాభాకు ఉండగా రెండు, మూడు దశల్లో అందరికీ మంచినీరు అందించాలనే లక్ష్యంతో అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. నీటి లభ్యతలేని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కాలనీలలో ట్యాంకులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అందుబాటులో ఉన్న నాలుగు నీటి వనరుల ద్వారా శివారు గ్రామాలకు నీరందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అనుపు ఎత్తిపోతల పథకం ద్వారా నాదెండ్ల మినహా మిగిలిన 14 మండలాల్లోని 259 శివారు గ్రామాలకు, బుగ్గవాగు రిజర్వాయర్ ద్వారా 5 మండలాల్లో 68 గ్రామాలకు పులిచింతల ప్రాజెక్టు ద్వారా 14 మండలాల్లో అమరావతి మినహా మిగిలిన 266 గ్రామాలకు, ప్రకాశం బ్యారేజీ నుంచి 16 మండలాల్లో (్భట్టిప్రోలు, వేమూరు, చెరుకుపల్లి, చుండూరు, కొల్లూరు, కొల్లిపర) మండలాలు మినహా 569 గ్రామాలకు మొత్తం 49 మండలాల్లో 1162 శివారు గ్రామాల ప్రజలకు మంచినీరందించేందుకు ప్రతిపాదనలు రూపొందించామని మంత్రి ప్రత్తిపాటి వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమం పూర్తయితే భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్య తలెత్తదన్నారు. వర్షాల కాలంగా జిల్లాలో మలిరేయా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణపై శ్రద్ద వహించాలని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భూగర్భజల వనరులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో విషజ్వరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు తొందరక్కర్లేదు!

*కేంద్రాలను పరిశీలించిన అర్బన్, రూరల్ ఎస్‌పిలు

గుంటూరు, అక్టోబర్ 12: అగ్రిగోల్డ్ అన్ రిజిష్టర్డ్ డిపాజిటర్లు తొందర పడాల్సిన అవసరం లేదని, పట్టణాలు, గ్రామాల వారీగా నిర్ణయించిన తేదీలలో వెరిఫికేషన్ సెంటర్లకు వచ్చి తమ ఒరిజినల్ పత్రాలను చూపించుకోవచ్చని అర్బన్, రూరల్ ఎస్‌పిలు సిహెచ్ విజయారావు, సిహెచ్ వెంకటప్పల నాయుడులు సూచించారు. గురువారం గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు సంబంధించిన విచారణ కేంద్రాలను పరిశీలించారు. అర్బన్ పరిధిలో మంగళగిరి, ప్రత్తిపాడు, నగరంలోని పలు కేంద్రాలను ఎస్‌పి సిహెచ్ విజయారావు పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారికి అర్ధమయ్యేలా చెప్పాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కాగా రూరల్ పరిధిలో ఎస్‌పి వెంకటప్పల నాయుడు పిడుగురాళ్ల, పొన్నూరు ప్రాంతాల్లో పర్యటించి కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌పి వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ చాలా మంది నెట్ సెంటర్ల యాజమాన్యాలు ఇదే అదనుగా తీసుకుని డిపాజిటర్ల వద్ద అధిక మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అపోహలను నమ్మవద్దని, రిజిష్టరు డిపాజిటర్లు పోలీసు సిబ్బందికి సహకరించి గ్రామాల వారీగా నిర్ణయించిన తేదీల్లో హాజరు కావాలని సూచించారు.