గుంటూరు

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), అక్టోబర్ 17: వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ, వృత్తికే జీవితాన్ని అర్పించి అమరులైన పోలీసుల త్యాగాల స్ఫూర్తితో పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషిచేయాలని గుంటూరు రేంజ్ డిఐజి కెవివి గోపాలరావు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీసు కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన డిఐజి గోపాలరావు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. గుంటూరు రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడుతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎంఎంకె, సేవాసదన్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు మిరియాల మురళీకృష్ణ రక్తదానం చేసిన వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం డిఐజి గోపాలరావును మురళీకృష్ణ, ప్రసాదరావు తదితరులు ఘనంగా సత్కరించారు. రక్తదాన శిబిరాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సీనియర్ వైద్యులు మండవ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఎఎస్‌పిలు సుబ్బారాయుడు, వైటి నాయుడుతో పాటు పలువురు డిఎస్‌పిలు, సిఐలు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

కొనుగోలుదారుకు బిల్లు ఇచ్చితీరాలి

సత్తెనపల్లి, అక్టోబర్ 17: ప్రతి అమ్మకం 200 రూపాయలు మించితే బిల్లు తప్పనిసరిగా ఇచ్చితీరాలని, ఇవ్వకపోతే 20 వేల రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని, అలాగే ప్రతి షాపునందు డిస్లేబోర్డులు తప్పనిసరిగా వుంచాలని కమర్షియల్ టాక్స్ అధికారి భారతుల రామకృష్ణ అన్నారు. సత్తెనపల్లి క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ది గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు జిఎస్‌టి చట్టంలోని నిబంధనల గురించి అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. సదస్సులో సిటిఒ మాట్లాడుతూ కొనుగోలుదార్లకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. ఆతుకూరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డిసిటిఒ, ఎసిటిఒలు, జిఎస్‌టి అధికారులు పాల్గొని రిటర్న్ ఫైలింగ్, ఇన్‌వాయిస్‌లపై సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మిడిశెట్టి జగన్మోహనరావు, కొప్పురావూరి పెద్దకనకయ్య, ప్రముఖ ఆడిటర్ కూరపాటి బసవయ్య, సోమిశెట్టి చిన్నసాంబశివరావు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇళ్లు నిర్మించుకోవాలి

పొన్నూరు, అక్టోబర్ 17: రాష్ట్రంలోని పేదలందరికీ 2022 నాటికి గృహ వసతి కల్పించాలన్న దృఢనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం గ్రామీణ స్కీం ఇళ్లు నిర్మించేందుకు ప్రోత్సహిస్తోందని హౌసింగ్ ఇఇ కల్లూరి బసవయ్య మంగళవారం పొన్నూరులో 2018-19 సంత్సరానికి 1100 ఎన్‌టిఆర్ గృహాలు మంజూరయ్యాయని చెప్పారు. 2016-17 సంవత్సరానికి గ్రామీణ స్కీం ద్వారా 1248 గృహాలకు ఆమోదం తెలుపగా 70 ఇళ్లు మాత్రమే నిర్మించబడ్డాయని 943 గృహాల నిర్మాణాలు జరగాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో 2017-18 సంవత్సరానికి గ్రామీణ స్కీం ద్వారా 1120 ఇళ్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపిందన్నారు. కేవలం 500 మంది మాత్రమే ముందుకు వచ్చి ఇళ్లు నిర్మించుకుంటున్నారని, అర్హులైన వారెవరైనా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తే అనుమతిస్తామన్నారు. గృహనిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిగావించిన ప్రజలను ప్రోత్సహించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు బసవయ్య తెలిపారు. పొన్నూరు పట్టణంలో రూ.3.50 లక్షలతో బిఎల్‌సి స్కీం ద్వారా 975 గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు. సమావేశంలో హౌసింగ్ డిఇ ఎం రమేష్, ఎఇ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.