గుంటూరు

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృతలూరు, అక్టోబర్ 17: అమృతలూరు సమీపంలో ఓ పాడుబడిన దుకాణంవద్ద బాబాయి, అన్న కుమార్తె ఇరువురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఈప్రాంతంలో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం అమృతలూరుకు చెందిన రాపర్ల సతీష్‌బాబు (40) ఎరువులు, పురుగుమందుల వ్యాపారిగా అన్న సురేష్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం సతీష్‌బాబు తన అన్న కుమార్తె చరితచౌదరి (6)ని తీసుకొని తెనాలిలోని తన ఫెల్టిలైజర్స్ ఆడిట్ నిమిత్తం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇరువులు గృహానికి చేరుకోకపోవటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి వివరాలు ఫోనుద్వారా తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవటంతో ఇద్దరి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇదిలావుండగా మంగళవారం ఉదయం అమృతలూరుకు చెందిన ధర్మా నీలాంబర్ అనే వ్యక్తి సురేష్‌బాబు ఇంటికివచ్చి మీ తమ్ముడు, కుమార్తె పెదపూడి గ్రామసమీపంలో మృతి చెందిపడియున్నట్లు సమాచారం ఇవ్వటంతో సంఘటన ప్రదేశానికి చేరుకొని పరిశీలించి తన తమ్ముడు, కుమార్తె మృతి చెందినట్లు ధ్రువపరచుకున్నారు. సమాచారం అందుకున్న తెనాలి డిఎస్పీ స్నేహిత, సిఐలు కళ్యాణ్‌రాజ్ శ్రీనివాసరావు, చండూరు ఎస్‌ఐ విక్టర్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గుంటూరు నుండి క్లూస్ టీమ్, డాగ్‌స్వాడ్ సంఘటన స్థలానికి రప్పించి ఆనవాళ్ళు సేకరించారు. శవ పంచనామా అనంతరం రెండు మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం, తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆర్‌ఎస్ శ్రీనివాస్ తెలిపారు. అయితే మృతుడు సతీష్‌బాబు చేతులు బ్లేడుతో కోసియుండటం, బాలిక నోరు, ముక్కులో నుండి రక్తం రావటం వంటి ఆనవాళ్లు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇరువురిని ఎక్కడో చంపి ఇక్కడ పడవేసియుండవచ్చుననే అనుమానాలు పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో సంఘటనలో దొరికిన బ్లేడు, మద్యం బాటిల్, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో విఫలం

*కేరళలో హత్యాకాండకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట బిజెపి ధర్నా

గుంటూరు, అక్టోబర్ 17: కేరళలో అధికారంలో ఉన్న సిపిఎం ముఖ్యమంత్రి పినరై విజయన్ శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమవడమే కాకుండా హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం హేయమైన చర్య అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు విమర్శించారు. కేరళలో సిపిఎం అధికార అండతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై సాగిస్తున్న హత్యాకాండకు నిరసనగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట బిజెపి అర్బన్ శాఖ నాయకులు మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో జూపూడి రంగరాజు మాట్లాడుతూ కేరళలో సుమారు 220 మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి కార్యకర్తలను అత్యంత కిరాతకంగా, క్రూరంగా చంపిన గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్టప్రతి జోక్యం చేసుకుని కేరళలోని సిపిఎం ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి రాష్టప్రతి పాలనను విధించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు సిద్ధాంతాలను, నైతిక విలువలను వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అర్బన్ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ప్రాబల్యం కోల్పోతున్నారని, ఉనికిని చాటుకునేందుకే కేరళలో హత్యాకాండను ప్రోత్సహిస్తూ భౌతిక దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఆలూరు కోటేశ్వరరావు, గండవరపు జగన్, నేరెళ్ల మాధవరావు, పాలపాటి రవికుమార్, ఈదర శ్రీనివాసరెడ్డి, చెరుకూరి తిరుపతిరావు, అప్పిశెట్టి రంగా, మాధవరెడ్డి, గౌస్ మొహిద్దిన్, కస్తూరి సైదులు, వెలగలేటి గంగాధర్, నాగమల్లేశ్వరి, బొల్లాప్రగడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.