గుంటూరు

గుంటూరులో మహాలక్ష్మి వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), అక్టోబర్ 20: ఇహపర సౌఖ్యాలతో పాటు మానవుడికి సర్వ ఐశ్వర్యాలను, అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ లక్ష్మీదేవి కొలువైయున్న నగరంలోని అన్ని మందిరాల్లో దీపావళి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వైభవం దేదీప్యమానంగా ప్రకాశించింది. ప్రతి ఏటా దీపావళి ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించడం నగర ప్రజానీకానికి ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం అరండల్‌పేటలోని హంపీ విరూపాక్ష పీఠానికి దత్తత చేయబడిన శ్రీ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ మందిరంలో విశేష పూజలను నిర్వహించారు. భక్తుల సహాయ సహకారాలతో అష్టలక్ష్మీ మూర్తులను 11 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో కనుల పండువగా అలంకరించారు. గురు, శుక్రవారాల్లో వందలాది మంది మహిళలు అష్టలక్ష్మీ మూర్తులను సేవించుకుని లక్ష్మీపూజల్లో పాల్గొన్నారు. లక్ష్మీ అష్టోత్తర సహస్రనామాలను పటిస్తూ సువాసినిలు కుంకుమార్చనలు చేశారు. శ్రావణమాసంలో ఒక మారు, దసరా పర్వదినాల్లో మరొకమారు, అలాగే దీపావళి ఉత్సవాలలో మూడు పర్యాయాలు బంగారువర్ణంతోదర్శనమిచ్చే శ్రీ మహాలక్ష్మీదేవికి, అష్టలక్ష్మీ మూర్తులకు కరెన్సీ నోట్లతో అలంకరించి ధనలక్ష్మీ పూజలు నిర్వహించడం ఈ మందిరంలో ఆనవాయితీగా వస్తున్నది.
శ్రీ కనకమహాలక్ష్మి సన్నిధిలో....
విద్యానగర్ సిద్ధార్ధనగర్‌లో కొలువై, నిత్య కుంకుమార్చనలు జరిపించుకుంటున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దీపావళి ఉత్సవాల్లో భాగంగా నయనానందకరంగా అలంకరించారు. శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైన కలువపుష్పాలు, స్వర్ణ్భారణాలతో నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సంగడిగుంటలో గల శ్రీ కంచికామ కోటి పీఠానికి చెందిన శ్రీ అష్టలక్ష్మీ మందిరంలో కూడా లక్ష్మీపూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అన్ని దేవాలయాలు, మందిరాల్లో లక్ష్మీవైభవం దీపావళి వెలుగుల మధ్య ప్రకాశించింది. కాగా గత 30 ఏళ్లకు పైబడి నగరంలో నివాసం ఉంటూ బంగారు షాపుల్లో పనిచేస్తున్న కోల్‌కత్తా, బెంగాళ్ నుంచి ఇక్కడకు తరలివచ్చిన కార్మికులు, బ్రాడీపేట 4వ లైను ప్రధాన రహదారిపై చూడచక్కనైన రీతిలో శ్రీ కాళికాదేవి ప్రతిమను ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నారు.
ఆనందోత్సాహాల మధ్య దీపావళి...
దీపావళి పండుగను రెండు రోజులుగా నగర ప్రజానీకం ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంది. బాలలు, యువకులు, వృద్ధులు తమ కుటుంబాలతో సహా బాణసంచాను కాలుస్తూ దీపావళిని వేడుకగా జరుపుకున్నారు.