గుంటూరు

‘పోలీసు కొలువు’ పేరిట టోకరా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల రూరల్, అక్టోబర్ 20: కారంపూడి మండల పరిధిలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కారు డ్రైవర్ చిరుమామిళ్ళ శ్రీకాంత్, ఆలపర్తి మణిచంద్రరాయ్ పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నలుగురు యువకులకు మాయ మాటలు చెప్పి సుమారు రూ.8 లక్షలు కాజేసినట్లు క్రైం డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని పశువేముల గ్రామానికి చెందిన బలబోయిన శ్రీను, మరపకుల బ్రహ్మం, కకనూరు సత్యనారాయణ, నర్సింగ్ వెంకట నారాయణలకు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు రూ.8లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. కానిస్టేబుల్స్ పరీక్షా ఫలితాల్లో బాధితులు తమ పేర్లు లేకపోవటంతో నిందితులను నిలదీశారు. తదుపరి లిస్ట్‌లో మీ పేర్లు వస్తాయని నమ్మబలికి వారి వద్ద నుండి వారి ఒరిజినల్ సర్ట్ఫికేట్లు తీసుకొని, జిల్లా రూరల్ ఎస్పీ సంతకం పోర్జరీ చేసి బాధిత యువకులు నలుగురికి నకిలీ పోలీసు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. పోలీసు గుర్తింపు కార్డులు అనుమానాస్పదంగా ఉండటంతో బాధితులు జిల్లా రూరల్ ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్, వెల్దుర్తి, మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసి విచారణ నిర్వహించారు. నిందితులను కారంపూడిలో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల నుండి రూ.4లక్షల నగదు, నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, ఒరిజినల్ సర్ట్ఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో రూరల్ సిఐ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మవద్దని, వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ హెచ్చరించారు.

ఎటిఎం కార్డులతో ఏమార్చే ఘరానా మోసగాడి అరెస్ట్

కారంపూడి, అక్టోబర్ 20: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న చందాన పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన హోంగార్డు తుమ్మల ఉదయ్‌కుమార్, అలియాస్ కిరణ్‌ను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుంటూరు క్రైం డిఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన తుమ్మల ఉదయ్‌కుమార్ పదో తరగతి వరకు చదివి 2006లో హైదరాబాద్‌లో హోంగార్డుగా ఎంపికయ్యాడు. డ్యూటీలో భాగంగా ముద్దాయిలను చెంచల్‌గూడ, చర్లపల్లి జైలు నుండి కోర్టుకు కోర్టు సిబ్బందితో కలిసి ఎస్కార్ట్‌గా పనిచేసేవాడు. ఈ నేపధ్యంలో ముద్దాయలను మాటల్లో పెట్టి ఎటిఎం కార్డులు దొంగిలించి, పిన్ నెంబర్లు తెలుసుకుని డబ్బులు డ్రాచేసే విధానాన్ని తెలుసుకున్నాడు. డబ్బుల కోసం ఇంత కష్టపడ్డం దండగ అనుకుని ‘ఖాకీ’ ముసుగులో కాసులు కొట్టేయడం ప్రారంభించి, దీన్ని 2012 నుండి ఆచరణలో పెట్టి దొంగతనాలు ప్రారంభించాడు. జేబు దొంగలకు వంద, రెండు వందల రూపాయల నగదు ఇచ్చి ఏటిఎం కార్డులు సంపాదించి, ఏటిఎం సెంటర్ల వద్ద వేచి ఉండి, వాటివద్దకు డబ్బుల కోసం వచ్చే వృద్ధులు, అమాయక ప్రజలకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ, డబ్బులు డ్రా చేస్తానని, నమ్మబలికి ఏటిఎం కార్డులు తీసుకుని, పిన్ నెంబర్లను తెలుసుకుని, వారికి డబ్బులు రావడం లేదని చెప్పి, తర్వాత అప్పటికే తన వద్దవున్న డూప్లికేట్ ఏటిఎం కార్డులను వారికిచ్చి తర్వాత వారి ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసుకుంటున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. తెలంగాణలోని కోదాడ, సూర్యాపేట, నకరికల్లు, నల్గొండ, మిర్యాలగూడ పట్టణాల్లో నేరస్థుడిగా అరెస్ట్ అయ్యాడని తెలిపారు. బెయిల్‌పై వచ్చిన ఉదయ్‌కిరణ్ మన రాష్ట్రంలోని గుంటూరు లాలాపేట, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, సూళ్ళూరుపేట, ఉదయగిరి, వింజమూరు, నెల్లూరు పట్టణం, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, వేల్పూరు, పికెకెపాలెం, గణపవరం, గోపాలపురం, భీమడోలు, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 60కి పైగా ఏటిఎం కార్డులు దొంగిలించి కాసులు కొట్టేశాడు. ఇతనిపై అరెస్ట్‌వారెంట్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కారంపూడి శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడికి వలంటరీ రిటైర్మెంట్ కింద 1.60లక్షల రూపాయలు వస్తే, అతని భార్య గౌరి ఏటిఎం ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు 2016 అక్టోబర్ 10న కారంపూడిలోని అంకాళమ్మ గుడి వద్ద ఉన్న ఎస్‌బిఐ ఏటిఎం వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ మాటువేసిన ఉదయ్‌కుమార్ డబ్బులు తీస్తున్నట్లు గౌరిని నమ్మించి ఏటిఎం కార్డు మార్చి పిన్ నెంబర్ తెలుసుకుని, పిడుగురాళ్ళ, పొన్నూరు, గుంటూరు, పర్చూరు పట్టణాల్లో 1,69,300 డ్రాచేశాడని డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సులువుగా వచ్చిన డబ్బుతో ఉదయ్‌కుమార్ వ్యసనాలకు బానిసై, పేకాట, మద్యానికి అలవాటుపడ్డాడని ఆయన తెలిపారు. దాచేపల్లిలోని క్యాపిటల్ కల్చరల్ క్లబ్‌లో మెంబర్‌షిప్ తీసుకుని, తరచూ జూదం ఆడుతుండేవాడని ఆయన చెప్పారు. కారంపూడిలోని ఆంధ్రాబ్యాంక్ ఏటిఎం వద్ద ఉదయ్‌కుమార్ శుక్రవారం సంచరిస్తుండగా, అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ నారాయణ స్వామి అదుపులోకి తీసుకుని, విచారించగా, ఏటిఎంల వద్ద దొంగతనాలు చేస్తంటానని విచారణలో తెలిపారు. అతని నుండి 1.20 లక్షల రూపాయల నగదు, రెండు ఏటిఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలేఖర్ల సమావేశంలో గురజాల ఇన్‌చార్జి డిఎస్పీ నారాయణరెడ్డి, సిఐ నరసింహారావు, ఎస్‌ఐ నారాయణ స్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.