గుంటూరు

అంతు చిక్కని గ్లైసెల్ బిటి పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 20: జిల్లాలో గ్లైసెల్ బిటి పత్తి విత్తనాల సాగు అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పర్యావరణానికి తూట్లుపొడిచే ప్రమాదముందని రైతులు దీని వలన తీవ్రంగా నష్టపోతున్నామని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే ఆర్‌ఆర్‌ఎఫ్, గ్లైసెల్ బిటి కాటన్ విత్తనాలు ఎక్కడ సాగు చేస్తున్నారనేది అధికారులకు అంతుపట్టడం లేదు. ప్రధానంగా అమరావతి మండలంలో ఈ రకమైన పత్తిసాగు జరుగుతోందని ప్రభుత్వ గుర్తించింది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు నిర్ధారించలేక పోతున్నారు. దీంతో ప్రభుత్వం జెనటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జిఇఎసి) కమిటీని అప్రమత్తం చేసింది. విజయవాడ ఎస్‌పిడిసిఎల్ వైస్ చైర్మన్, ఎండి ఎస్ బాలకృష్ణ, ఆచార్య రంగా విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం డైరెక్టర్ ఎన్‌వి నాయుడు గుంటూరు వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలు నాయక్‌తో కమిటీ ఏర్పాటుచేసి 15 రోజుల్లో నివేదిక అందజేయాలని పర్యావరణ పరిరక్షణ చట్టం 1989ని ఉల్లంఘిస్తూ బిటి పత్తి సాగు చేస్తున్న రైతులపై క్రిమినల్ కేసులు బనాయించాల్సిందిగా ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పొలాల్లో ఈ రకమైన విత్తనాలు వాడిన చేలను గుర్తించడంలో అధికారులకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. తాజాగా లాం ఫారం రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వి చెంగారెడ్డి, విత్తన విభాగం జాయింట్ డైరెక్టర్ కెవి రామరాజు, సీడ్ రెగ్యులేషన్ సెల్ ఎడి కెఎంఇ ప్రసాద్, డిఎన్‌ఎ ఫింగర్‌ప్రింట్ ల్యాబ్‌కు చెందిన ఎడి జయకృష్ణ లను నియమించింది. ఆర్‌ఆర్‌ఎఫ్, గ్లైసెల్ బిటి పత్తి విత్తనాలు సాగు చేస్తున్న పొలాలను గుర్తించడంతో పాటు విత్తనాలు ఎక్కడి నుండి రవాణా అవుతుంది సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయనే విషయంపై అధికారులు ఇప్పటికే ఆరా తీశారు. కొందరు రైతులు మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాల్లో కౌలు పద్ధతిన పత్తిసాగు చేస్తుంటారని, వారి ద్వారానే ఇక్కడకు రవాణా అయినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయమై అమరావతి ఎఒ దాసరి లావణ్యను వివరణ కోరగా ప్రభుత్వాదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని స్పష్టంచేశారు.