గుంటూరు

అలరించి, ఆలోచింపజేసిన పరిషత్ పోటీ నాటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఏప్రిల్ 29: పట్టణానికే గర్వకారణమైన ప్రగతి కళామండలి 68వ వార్షికోత్సవ, 43వ కళాపరిషత్ సాంస్కృతిక పోటీలు శుక్రవారం స్థాని క సరస్వతీ శిశుమందర్ ఉన్నతపాఠశాల ఆవరణలో జరిగాయి. సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ప్రదర్శించిన బైపాస్ నాటిక, కళాంజలి హైదరాబాదు వారు ప్రదర్శించిన ఇల్లాలి ముచ్చట్లు హాస్యనాటిక, ప్రకాశం జిల్లా కొప్పోలు పండు క్రియేషన్స్ వారి అమ్మ సొత్తు నాటిక అలోచింప జేసి, కళాభిమానులను అలరించాయి. అనుభవాలే మనిషిని మారుస్తాయి, అనుభవాలే మనిషిగా మారుస్తాయి అన్న కథాంశంలో సాగిన బైపాస్ నాటికలో అయిన వాళ్ళ దగ్గర ఆత్మీయతను అందుకోలేకపోతే, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ బైపాస్‌ను వెతుక్కోవాల్సిందేనన్న సందేశంతో ఆద్యంతం ఆలోచింపజేసింది. ధనం మనిషిని నడిపే ఇంధనం, ఆ ధనం కోసం మనుషులు ఎన్నో చేస్తుంటారు. అటువంటి ఇల్లాలి ముచ్చట్లు నాటికలో ఓ బస్సు యాక్సిడెంట్‌లో చనిపోయిన వారి పేర్లలో ఓ పేరు ఇల్లాలి భర్తపేరు. తన భర్తను దాచిపెట్టి చనిపోయింది తన భర్తేనని ఎక్స్‌గ్రేషియా 5 లక్షలు కాజేస్తుంది ఆ ఇల్లాలు. ఎప్పటికైనా మిగిలేది మన కష్టార్జితమేనని తెలిసేట్టు చేస్తాడు ఇల్లాలి భర్త. అదే విధంగా అమ్మసొత్తు నాటికలో చనిపోయిన తల్లి ఒంటిమీది నగల కోసం పుట్టింటికి వచ్చి మనిషి పోయిందని కాకుండా ఆమె ఒంటిమీద నగలకోసం కొట్లాడుకున్న కన్నబిడ్డలకి బుద్ధి చెప్పే కధాంశంలో కడుపున పుట్టిన వాళ్ళు ఆస్తులకోసం ఏడుస్తుంటే, పిడికెడు గడ్డివేసి ఆకలితీర్చిన ఆ తల్లి కోసం పెరట్లోవున్న పశువులు నీళ్ళు ముట్టకుండా అంబా అంటూ ఏడుస్తున్న నాటికలోని సన్నివేశం ప్రేక్షకులను కదిలించింది.