గుంటూరు

తహశీల్దార్ బెదిరింపులతో ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వట్టిచెరుకూరు, నవంబర్ 17: మండలంలోని కొర్నెపాడులో గత 25 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 180/బిలో పగడాల చిన్నసాంబయ్య నివసిస్తుండగా, ఆ నివాస స్థలాన్ని రుద్రవరపు సాంబయ్య తదితరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా ఆ స్థలంలో ఎవరు ఉండాలనేది గ్రామానికి వచ్చి చర్చించి, గ్రామస్థులతో మాట్లాడి చెప్తానన్నారు. నా స్థలంలో నేను ఉండటానికి మీరు ఇబ్బంది పెడతారా అంటూ తహశీల్దార్‌ను అంటూ ఈ విషయంపై కలెక్టర్‌ను సంప్రదిస్తానని కోరగా, తహశీల్దార్ దుర్భాషలాడి నీకు చేతనైంది చేసుకోమంటూ చొక్కా పట్టుకున్నాడని బాధితుడు వాపోయాడు. కబ్జాదారులకు తహశీల్దార్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మనస్థాపం చెంది శుక్రవారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకేందుకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులందరూ ఏకమై అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఎస్‌ఐ అశోక్, సిఐ రవికుమార్ బాధితుడికి నచ్చజెప్పారు. సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.