గుంటూరు

ఫలించిన అఖిలపక్షం ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, నవంబర్ 17: మంగళగిరి మండల ప్రజాపరిషత్ పాలకవర్గం, ఎంపిడిఓ మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. పాలక ప్రతిపక్ష సభ్యులను ఖాతరు చేయకుండా ఎంపిడిఓ జి పద్మావతి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ, టిడిపి, సిపిఎం సభ్యులు గడిచిన వారంరోజులుగా ఆందోళనకు దిగారు. మండల పరిషత్‌కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ గదులకు ఈనెల 23న వేలంపాట జరుపనున్నట్లు పాలకవర్గానికి తెలియకుండా ఎంపిడిఓ ప్రకటన చేశారని పాలక ప్రతిపక్ష సభ్యులు జిల్లా కలెక్టర్‌కు, జడ్‌పిసిఇఓకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జడ్‌పిసిఇఓ నాగార్జున సాగర్ స్వయంగా ఈనెల 15న మంగళగిరి మండల కార్యాలయానికి వచ్చి పాలకవర్గం సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఎంపిడిఓ బదిలీకి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం ప్రస్తుత ఎంపిడిఓ పద్మావతిని విధుల నుంచి తొలగించి ఇన్‌చార్జ్ ఎంపిడిఓగా యడ్లపాడు ఎంపిడిఓ సువార్తమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి జడ్‌పిసిఇఓతో చర్చించి కొత్త ఎంపిడిఓను నియమించే విధంగా కృషి చేశారని టిడిపి సభ్యులు తెలిపారు. కాగా ఈనెల 23న జరుప తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ గదుల వేలంపాట జరుగుతుందా వాయిదా పడుతుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. షాపు లీజుదారులు కొందరు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ నెల 10వ తేదీనుంచి ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ గదులను ఖాళీ చేయించి వేలంపాట నిర్వహించనున్నట్లు అధికారులు చేసిన ప్రకటనకు నిరసనగా లీజుదారులు జరుపుతున్న రిలే దీక్షలు శుక్రవారం 8వ రోజు కూడా కొనసాగాయి.

పోటాపోటీగా అథ్లెటిక్స్

నాగార్జున యూనివర్సిటీ, నవంబర్ 17: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణంలో జరుగుతున్న కోరమాండల్ 33వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు నువ్వా.. నేనా.. అన్నట్టు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండవ రోజైన శుక్రవారం జరిగిన పోటీలలో షార్ట్‌పుట్ అంశంలో న్యూమీట్ రికార్డులు నమోదయ్యింది. బాలుర విభాగంలో షార్ట్‌పుట్ అంశంలో హార్యానాకు చెందిన దీపేంద్ర దబాస్ 20.99 మీటర్ల దూరం విసిరి, గతంలో తన పేరు మీద నమోదైన 20.63 మీటర్ల రికార్డును అధిగమించి సరికొత్త రికార్డును నమోదు చేశాడు. జావెలిన్‌త్రో అంశంలో మహారాష్టక్రు చెందిన వికాశ్‌యాదవ్ ప్రధమ, హార్యానాకు చెందిన సందీప్ ద్వితీయ, రాజస్ధాన్‌కు చెందిన దేవంజ్ త తీయ స్ధానాలు సాధించారు. 110 మీటర్ల హార్డిల్స్ పోటీలలో కేరళకు చెందిన సచిన్ బినూ ప్రధమ, ఢిల్లీకి చెందిన కునాల్‌చౌదరి ద్వితీయ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి గోపిచంద్ త తీయ స్ధానాలు సాధించారు. 100 మీటర్ల హార్డిల్స్ అంశంలో కేరళకు చెందిన ఆర్‌కె సూర్యాజిత్ ప్రధమ, పశ్చిమబెంగాల్‌కు చెందిన దిబియా సుందర్‌దాస్ ద్వితీయ, హార్యానాకు చెందిన ప్రవీణ్ త తీయ స్ధానాలు కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో 10వేల మీటర్ల నడక పోటీలలో హార్యానాకు చెందిన సంజయ్‌కుమార్ ప్రధమ, పంజాబ్‌కు చెందిన అక్షదీప్ సింగ్ ద్వితీయ, ఉత్తరాఖండ్‌కు చెందిన సూరజ్‌పన్వార్ త తీయ స్ధానాలు కైవసం చేసుకున్నారు. బాలికల 10వేల మీటర్ల నడక పోటీలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బంధన్‌పటేల్, ప్రియాంకా పటేల్‌లు వరుసగా ప్రధమ, ద్వితీయ స్ధానాలు సాధించగా, రాజస్ధాన్‌కు చెందిన సోనాల్ సుఖ్వాల్ త తీయ స్ధానాలు సాధించారు. బాలుర విభాగంలో పంజాబ్‌కు చెందిన దమనీత్‌సింగ్ ప్రధమ, రాజస్ధాన్‌కు చెందిన నితీష్ పునియా ద్వితీయ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆలీముద్దీన్ త తీయ స్ధానాలు సాధించారు.