గుంటూరు

వ్యవసాయరంగానికి సాంకేతిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటరు, నవంబర్ 17: రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయరంగంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని కొరియా కాన్సులేట్ జనరల్ హ్యాంగ్ టియా కిమ్ తెలిపారు. శుక్రవారం దక్షిణ కొరియా బృందం గుంటూరు మార్కెట్ యార్డును సందర్శించి మిర్చికొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ కొరియా ప్రజలు మిర్చిని ఎక్కువగా వినియోగిస్తారన్నారు. మిర్చిని ఈ ప్రాంతం నుండి తమ దేశానికి దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సుమారు 3 వేల బిలియన్ డాలర్ల మిర్చిని 15 దేశాలకు ఎగుమతి చేయడ గొప్ప విషయమన్నారు. మిర్చిలో ఇన్ని రకాల వెరైటీలు పండిస్తున్న జిల్లా రైతాంగాన్ని అభినందించారు. మైక్రో ఇరిగేషన్‌తో పాటు మానవ వనరులు తక్కువగా ఉండే యంత్ర పరికరాలు అందజేస్తామన్నారు. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ మిర్చి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంతం అనువైందని చెప్పారు. బిల్‌గేట్స్, కిమ్ లాంటి వారు రాష్ట్రానికి రావడం వలన పరిశ్రమలు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. మిర్చి ఎగుమతి చేస్తే ఎగుమతి దారులను ప్రోత్సహిస్తామన్నారు. హసర్ కన్సులేట్ జనరల్ చుక్కపల్లి సురేష్ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుంటూరు మిర్చియార్డుకు గుర్తింపు తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కొరియాలో వ్యవసాయాన్ని, ఆహార పరిశ్రమలను బాగా ప్రోత్సహిస్తారని చెప్పారు. అనంతరం కొరియా ప్రతినిధి బృందాన్ని యార్డు చైర్మన్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎగుమతిదారుల ప్రతినిధి అరుణకుమార్, సిద్దార్ధ కార్పొరేషన్ ప్రతినిధి కుర్రి సాంబిరెడ్డి, యార్డు వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, షేక్ లాల్‌వజీర్, బాణావత్ రాజీబాయి, షేక్ బాజి, కిలారి రోశయ్య, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారత్, కొరియా సంప్రదాయాలకు సారూప్యం

*వర్సిటీని సందర్శించిన కొరియన్ టీమ్

నాగార్జున యూనివర్సిటీ, నవంబర్ 17: కొరియన్ కాన్సులేట్ హాన్గ్‌తికిమ్ తన బృందంతో శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా వర్సిటీ డైక్‌మెన్ ఆడిటోరియంలో విద్యార్ధులు, అధికారులతో జరిగిన సమావేశంలో హన్గ్‌తికిమ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర, సంప్రదాయాలు విశిష్టమైనవని, ఆచార వ్యవహారాలలో భారతదేశానికి, కొరియన్ సంప్రదాయాలకు అనేక అంశాలలో సారూప్యత ఉంటుందని విశదీకరించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన జీవన విధానంగా కొనియాడబడుతున్న బుద్ధిజం భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతోందని అన్నారు. కొరియాలో బుద్ధిజం కొనసాగుతోందని ఆయన తెలిపారు. వర్సిటీ వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వివిధ దేశాల సంప్రదాయాలను, చరిత్రను పరిశీలించటం ద్వారా ప్రపంచ మానవ చరిత్ర గమనాన్ని అర్ధం చేసుకోగలుగుతామని అన్నారు. త్వరలో వర్సిటీలో కొరియన్ భాషకు సంబంధించిన అధ్యయన తరగతులు నిర్వహించడానికి చర్యలు చేపడుతన్నట్లు తెలిపారు. అనంతరం వర్సిటీలో బుద్ధిజం విభాగాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిష్ట్రార్ ఆచార్య జాన్‌పాల్, చుక్కపల్లి సురేష్, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

నీరు వదిలే వరకు ఉద్యమం

*వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి అంబటి

నరసరావుపేట, నవంబర్ 17: నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు దాళ్వా పంట వేసుకునేందుకు న్యాయపరంగా సాగర్ జలాలను విడుదల చేసేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని వైసీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు నీరు అందించేంత వరకు ఈ ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాంల్లో నీరు పుష్కలంగా ఉందని, రైతులు దాళ్వా పంట వేసుకునేందుకు నీటిని విడుదల చేయవచ్చన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన ఎస్‌ఈకి వినతిపత్రం అందచేశామని, ప్రభుత్వం స్పందించకపోవడంతో 14న అడ్డరోడ్డు వద్ద ధర్నా చేశామన్నారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. గురువారం మార్కెట్‌యార్డు సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు దాళ్వాకు నీరు ఇస్తామని చెప్పడం జరిగిందని, అయితే వరిసాగుకు నీరు ఇస్తామని సిఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈమేరకు ఈ నెల 20న ప్రకాష్‌నగర్‌లోని సప్తపది కల్యాణ మండపంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అంబటి ప్రకటించారు. ఈ సమావేశానికి టీడీపీ వినా అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. అనంతరం ఉమ్మడి కార్యాచరణ నిర్ణయాలు తీసుకుని, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 14న అడ్డరోడ్డు వద్ద ధర్నా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నవంబర్‌లో ఆరుతడి పంటలకు 16 టిఎంసీల నీరు విడుదల చేస్తారని, ఇప్పుడు ప్రభుత్వం నీరు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తే, రైతులు నార్లు పోసుకుంటారని వివరించారు. రైతులతో అవసరమైతే డ్యాం వద్దకు వెళ్లి గేట్లు ఎత్తే చర్యలు చేపడతామని, కేసులకు భయపడేది లేదని గోపిరెడ్డి స్పష్టం చేశారు. స్పీకర్ తన కుమారుడు, కుమార్తె ఏం చేస్తున్నారో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. గుంటూరులోని గుంటగ్రౌండ్‌లో నిర్మించే భవనానికి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోని ఇసుక తరలిస్తున్నారని, ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ నుండి పనివారిని తీసుకెళ్ళి గుంటూరులో పనిచేయించుకుంటున్నారని విమర్శించారు. గతంలో మద్యం, మట్టి, ఎన్‌ఆర్‌ఈజిఎస్ పనుల్లో దోచుకున్నారని, ప్రస్తుతం కంకర, ఇసుక, మున్సిపాలిటీపై పడి దోచుకుంటున్నారని విమర్శించారు. సమావేశంలో రాజుపాలెం జడ్‌పీటీసీ సభ్యుడు మర్రి వెంకట రామిరెడ్డి, పిల్లి ఓబుల్‌రెడ్డి, భవనం రాఘవరెడ్డి, వంగా రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హోదాపై కేంద్రం మోసం

*చలసాని శ్రీనివాస్

గుంటూరు, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించే విషయంలో మోసం చేసిందని, హోదా ముగిసిన అధ్యాయమని పేర్కొనడం సరికాదని ప్రత్యేక హోదా సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో సమితి జిల్లా అధ్యక్షుడు మల్లిఖార్జునరావు అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. హోదా కోసం నలభై నెలలుగా పోరాటం చేస్తున్నామని, రాష్ట్రానికి హోదా కల్పిస్తే కేంద్రం ఇచ్చే పథకాల్లో 90 శాతం మేరకు రాయితీ లభిస్తుందని, ఇక్కడ పరిశ్రమలు పెట్టే వారికి ఆదాయపన్ను, అమ్మకం పన్ను వంటివి లభిస్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 5 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి జంకుతున్న కేంద్రం ఇటీవల మహారాష్టక్రు 60 వేల కోట్లు ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తాత్సారం చేస్తుందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని పేర్కొన్న కేంద్రం 11 రాష్ట్రాల ప్రత్యేక హోదా కాలపరిమితిని ఎలా పొడిగించిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే పన్ను మినహాయింపులతో పరిశ్రమలు స్థాపించేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తారని తెలిపారు. కేవలం బీజేపీ నేతలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయిస్తూ మిగిలిన రాష్ట్రాలకు మొండిచేయి చూప్తుందన్నారు. రాష్ట్రానికి హోదా సాధించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కల్పించకుండా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతుందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన జరిగే ఛలో అసెంబ్లీ ముట్టడిలో అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, జనసేన రాష్ట్ర నాయకులు సతీష్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ఇతర నాయకులు మహంకాళి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.