గుంటూరు

విద్యుదాఘాతానికి రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్గి, నవంబర్ 20: విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని చామరాజుపురం గ్రామంలోని పోలంలో సోమవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మర్రెబోయిన వెళంగిణిరాజు (36) నాలుగు ఎకరాల మాగాణి సాగుచేశాడు. పురుగుమందు కొట్టేందుకు భార్య లక్ష్మీతోకలసి పిచికారి చేస్తుండగా, బోర్ లైన్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తెగి వేళాంగిణిరాజుపై పడడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన భార్య లక్ష్మీ చుట్టుపక్కల పొలాల వారు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి రాజు మృతి అప్పటికే మృతి చెందాడు. సంఘటనా సమాచారాన్ని తెలియచేయడంతో ఘటనా స్ధలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతునికి ఇరువురు కుమార్తెలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసకుని, దర్యాప్తు చేస్తున్నారు.

రసవత్తరంగా కోడిపోరు
కారంపూడి, నవంబర్ 20: పల్నాటివీరుల మహోత్సవాల్లో కోడిపోరు ఘట్టం రసవత్తరంగా హోరాహోరీగా సోమవారం జరిగింది. స్థానిక వీర్లదేవాలయం ఆవరణలో పీఠాధిపతి తరణ్ చెన్నకేశవ అయ్యవారు కోడిపందాలను నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి బ్రహ్మనాయుడిగా, తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి చలమారెడ్డి నాయకురాలు నాగమ్మగా పీఠాధిపతి కోడి పందాలను వేశారు. ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి బ్రహ్మనాయుడి కోడి చిట్టిమల్లు రెండు సార్లు గెలిచింది. మూడోసారి చలమారెడ్డి కోడి మాయతో శివంగిడేగ గెలిచింది. ఆనాడు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ మధ్య జరిగిన కోడి పందాలు నేటికీ వీర్ల దేవాలయం ఆవరణలో వేయడం ఆనవాయితీ. కోడిపోరు ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. కక్షలు, కర్పణ్యాల నిలయం, పౌరుషాల పురిటిగడ్డ పల్నాటి ప్రాంతమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమారెడ్డి అన్నారు. పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉందని మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పౌరుషానికి ప్రతీక పల్నాటి ప్రాంతమని, రాష్ట్రంలోని పల్నాడుకు ఓక ప్రత్యేకత ఉందన్నారు. కోడిపోరు ఘట్టంలో పీఠం నిర్వాహకులు విజయ్, జడ్‌పీటీసీ నాయకులు గోపిరెడ్డి, వైయస్సార్‌సీపీ నాయకులు షేక్ అక్బర్, పుల్లయ్య, ఎంపీపీ నాగులూనాయక్, లింగయ్య, లక్ష్మీనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.