గుంటూరు

క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే లక్ష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, నవంబర్ 20: నవ్యాంధ్రప్రదేశ్‌ను క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి కొల్లి రవీంద్ర అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణంలో సోమవారం సాయంత్రం జరిగిన 33వ జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ నవ్యాంధ్రప్రదేశ్‌లో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు అవపరమైన వౌలిక వసతులను కల్పించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు అందివ్వటం ద్వారా దేశం గర్వించదగిన క్రీడాకారులను తయారు చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు. గ్రామీణస్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని మండలాలలో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలలో కూడా ప్రవేశం ఉన్న తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవటంలో ముందంజలో ఉంటున్నారని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుందన్నారు. విద్యా సంస్థలలో విద్యతోపాటు క్రీడలకు తగిన ప్రోత్సాహం అందివ్వడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. క్రీడలు మానసికోల్లాసంతో పాటు క్రమశిక్షణ కల్గిన జీవితాన్ని అందిస్తాయని, రానున్న రోజులలో రాష్ట్రంలో క్రీడాకారులకు మరిన్ని వసతుల కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ మాట్లాడుతూ పాఠశాల స్ధాయి నుండి విద్యార్ధులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందింప చేయాలని కోరారు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవలేదని, రాష్ట్రానికి చెందిన పివి సింధూ, శ్రీకాంత్ వంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్, క్రీడల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మాణ్యం, వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఆచార్య పిపి ఎస్ పాల్‌కుమార్, పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా 23 కోట్ల మొక్కలు నాటాం..
* మంత్రి సిద్ధా రాఘవరావు
నరసరావుపేట, నవంబర్ 20: రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా 23కోట్ల మొక్కలు నాటడం జరిగిందని అటవీ శాఖామంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. సోమవారం కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో అటవీ, వన్యప్రాణ, పర్యావరణ పరిరక్షణపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేవ్ లెజిస్టేటివ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మనం-వనం కార్యక్రమంలో సభాపతి డాక్టర్ కోడెల ఆధ్వర్యంలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 23శాతం అటవీ ప్రాంతం ఉందని, సీఎం చంద్రబాబునాయుడు ఆశయాల మేరకు 2029నాటికి రాష్ట్రంలో 50శాతం గ్రీనరీ సాధిండం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం 25కోట్ల మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి అటవీ శాఖాధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అటవీ ప్రాంత అభివృద్ధికి, పర్యావరణానికి స్పీకర్ కోడెల కృషి ఎనలేనిదన్నారు. పచ్చదనం సంతరించుకున్న కోటప్పకొండ దీనికి ఉదాహరణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకో టూరిజానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని 13జిల్లాల్లో నగరవనం ఏర్పాటుకు ఐదు జిల్లాలకు అనుమతి రాగా, మూడు జిల్లాల్లో రాజమండ్రి, కర్నూలు, గుంటూరు నగర వనాలను పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం భగవంతుని సేవగా భావించాలన్నారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో జూ పార్కు, నైట్ సఫారీ అభివృద్ది చేస్తున్నామన్నారు. కోటప్పకొండను మరింత అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ ద్వారా నిధులు మంజూరు చేస్తామన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ అన్ని కమిటీల కన్నా లెజిస్లేటివ్ కమిటీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అటవీ, వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణపై ఒ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ గత జూలై లో హైదరాబాద్‌లో తొలి సమావేశం నిర్వహించగా, రెండో సమావేశం ప్రస్తుతం కోటప్పకొండలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సమావేశం పర్యాటక ప్రదేశాల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీశైలం, అరకు, నల్లమల అడవుల్లో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న ఈముపక్షి, నెమలి గుడ్లను అటవీశాఖ అధికారులు మంత్రి సిద్ధా, కోడెలకు చూపించారు. ఈ గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయన్నారు. తొలుత ఘాట్ రోడ్డులోని వన్యప్రాణి కేంద్రాన్ని సిద్ధా రాఘవరావు, శాసనమండలి సభ్యులు కరణం బలరామ్, సోము వీర్రాజు, రామసుబ్బారెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతరామ్, అటవీ శాఖ ఛీఫ్ సెక్రటరీ సూర్యనారాయణ, అటవీశాఖాధికారులు ఎస్‌ఎం చౌటప్ప, ఎన్ ప్రదీప్‌కుమార్, మోహన్‌రావు, ఆర్డీవో గంధం రవీందర్, తహశీల్దార్ విజయజ్యోతికుమారి, డిఎస్పీ కె నాగేశ్వరరావు, సిఐలు ప్రభాకర్, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత లెజిస్లేటివ్ కమిటీ సభ్యులకు ఆలయ ఈవో సాదరంగా ఆహ్వానించారు. వీరికి స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామి వారి ప్రసాదం, స్వామివారి జ్ఞాపికను అందచేశారు.