గుంటూరు

సామాన్యులకు అందుబాటులోకి ఇసుక విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మార్చి 22: సామాన్యులకు సైతం ఉచితంగా ఇసుకను అందించాలన్న ప్రభుత్వ విధానాలకు మరింత బలం చేకూర్చేలా పోలీసుశాఖ కృషిచేస్తుందని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఐజి సంజయ్‌కుమార్ అన్నారు. ఆయన మంగళవారం ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను అంతర్‌రాష్ట్రాలకు తరలివెళ్లకుండా ఉండేలా కృష్ణా, నల్గొండ, కమ్మం సరిహద్దు ప్రాంతమైన మాదిపాడు గ్రామంలో చెక్‌పోస్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజి సంజయ్ విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే అంతర్‌రాష్ట్రాలకు ఇసుక తరలివెళ్లకుండా చర్యలు చేపట్టామన్నారు. అనుమతులు ఉన్న ఇసుకరీచ్‌లలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చన్నారు. ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక మాఫియాకు సహకరిస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే ఎంతటివారినైనా సహించబోమని, సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టంచేశారు.ఈ సందర్భంగా మాదిపాడులో చెక్‌పోస్ట్‌ను ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఐజి సంజయ్ వెంట రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్, డిఎస్‌పి మధుసూధనరావు, పలువురు సిఐలు, సిబ్బంది ఉన్నారు.