గుంటూరు

అనుమానాస్పద స్థితిలో కొత్త పెళ్లికొడుకు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈపూరు, మే 3: పెళైన రెండోరోజే పెళ్బికొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఈపూరులో చోటుచేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని మద్దం దేవేంద్ర కుమారుడు వెంకటేష్ (24)కు ఏప్రిల్ 29 రాత్రి ఘనంగా వివాహం జరిగింది. 30న వెంకటేష్ స్నేహితులైన అన్నదమ్ములు చిట్టేటి శ్రీను, చిట్టేటి నాగేంద్రబాబు పార్టీ చేసుకుందామని వెంకటేష్‌ను ఆహ్వానించారు. ముగ్గురూ కలిసి పార్టీ చేసుకునే సమయంలో అన్నదమ్ములు శ్రీను, నాగేంద్రబాబులు నువ్వు మా అక్కను ప్రేమించి, మరో అమ్మాయిని ఎందుకు పెళ్ళి చేసుకున్నావని ఘర్షణ పడ్డారు. అనంతరం ఇద్దరు అన్నదమ్ములూ వారి అక్కను తీసుకువచ్చి వెంకటేష్ వద్ద వదిలి వెళ్ళారు. అక్కడికి వచ్చిన యువతి వెంకటేష్‌తో తనను ఎందుకు వివాహం చేసుకోలేదని ఘర్షణకు దిగింది. ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి ఇద్దరూ పురుగుమందు తాగి చనిపోదామని ప్రేమికులిద్దరూ నిర్ణయించుకున్నారు. రహస్య ప్రదేశానికి వెళ్ళిన ప్రేమికులు మద్యం తాగివున్న వెంకటేష్ పరుగుమందు తాగిన తర్వాత ప్రేమించిన యువతి నేనెందుకు చనిపోతాను, నేను పురుగు మందు తాగనని అడ్డం తిరిగి పారిపోయింది. పురుగుమందు తాగిన వెంకటేష్ జరిగిన విషయాన్ని రహస్యంగా ఉంచి, ఏమీ జరగనట్లు ఇంటికి చేరాడు. రాత్రికి వెంకటేష్‌కు కడుపులో నొప్పిరావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళే ముందుగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు.
అప్పటికే పురుగుమందు శరీరంలో జీర్ణించుకోవడంతో వినుకొండ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి నరసరావుపేటకు తరలించారు. పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి దేవేంద్ర ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి వద్దనే వెంకటేష్ శరీరం నుండి వైద్య పరీక్షల నిమిత్తం అవసరమైన భాగాన్ని వైద్యులు సేకరించారు. వెంకటేష్ మృత దేహాన్ని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సందర్శించి, తల్లిదండ్రులను ఓదార్చారు.