గుంటూరు

జీడీసీసీబిలో అంతులేని అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 5: జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అవినీతి చెద పట్టింది.. అంతులేని అక్రమాలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది.. ఏడాదిన్నర క్రితం ఇష్టారాజ్యంగా అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ శాఖకు ఫిర్యాదులు అందాయి. కొందరు ఉద్యోగులు.. ఉన్నతాధికారులు బినామీ పేర్లు సృష్టించి కోట్లాది రూపాయల మేర ఆరగించినట్లు తేలింది. అంతేకాదు జీడీసిసిబి పరిధిలో జరిగిన నిర్మాణాలలో సైతం నిధులు మింగినట్లు చెప్తున్నారు. సహకార రంగంలో రైతులకు సేవలందించాలనే లక్ష్యంతో 1965లో ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలతో పాటు ప్రతి జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకులు వెలిశాయి. అయితే సొసైటీలతో పాటు బ్యాంకులలో అవినీతి చోటు చేసుకోవటంతో ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ఓ ఉన్నతాధికారి పాలకవర్గాలను సైతం పక్కదారి పట్టించి అవినీతికి బీజం వేశారనే అభియోగాలు వినవచ్చాయి. ఆ అధికారితో పాటు మరికొందరు ఉద్యోగులపై విజిలెన్స్ అధికారులు నిఘాపెట్టి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. రైతులకు గోల్డ్‌లోన్లు, క్రాప్‌లోన్లు మంజూరు చేశారు. అయితే ఇందులో రైతుల పేర్లు, చిరునామాలను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు విస్తుపోతున్నారు. భారీగా అవినీతి జరిగి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు తెలియవచ్చింది. గత కొనే్నళ్ల క్రితం జీడీసిసిబిలో ఉద్యోగ నియామకాలను ముంబైకి చెందిన ఐబీపీఎస్ నిర్వహించింది. అప్పట్లో పాలకవర్గం తరపున వౌఖిక పరీక్షలకు కొన్ని మార్కులు కేటాయించారు. ఇందులో ఓ అధికారి కీలకపాత్ర వహించి అభ్యర్థులను అడ్డదారిలో నియమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలలో సైతం చేతివాటం జరిగిందని చెప్తున్నారు. కొద్దినెలల క్రితం నూతనంగా ఏర్పాటయిన పాలకవర్గం గతంలోని అక్రమాలపై విచారణ జరపాలని నిర్ణయించింది. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపిపి జీడీసీసీబి అక్రమాల చిట్టాను విజిలెన్స్ విభాగానికి చేరవేసినట్లు తెలిసింది. దీనిపై పూర్తిస్థాయిలో విచరణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో రుణాలు ఇతరత్రా ఆర్థికపరమైన లావాదేవీలపై విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయని.. నాసిరకం నిర్మాణాలను తేల్చాలంటే ఫోరెన్సిక్ పరీక్షలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. విజిలెన్స్ ప్రాథమిక విచారణ పూర్తయ్యాక వాస్తవాలు వెలుగుచూడగలవనేది స్పష్టమవుతోంది.

గుంటూరులో
కుంభవృష్టి
* పెనుగాలుల బీభత్సం
* నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
* పిడుగుపాటుకు ఒకరి మృతి
గుంటూరు, మే 5: గుంటూరు జిల్లాలో బుధవారం రాత్రి కుంభవృష్టి కురిసింది.. పెనుగాలుల విధ్వంసానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.. రాత్రి 10 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈదురుగాలుల కారణంగా గుంటూరు నగరంతో పాటు మంగళగిరి పట్టణం, పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు ప్రవహించింది. గత రెండు నెలలుగా వేసవి తాపంతో సొమ్మసిల్లిన జిల్లా ప్రజలకు వర్షం ఊరట కలిగించింది. కాగా పిడుగుపాటుకు కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో శ్రీనివాసరెడ్డి (45) అనే వ్యక్తి మృతిచెందాడు. విద్యుత్, ఆర్ అండ్ బి అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. గుంటూరు నగరంలోనే అత్యధిక వర్షపాతం కురిసింది. తెనాలి, నరసరావుపేట డివిజన్లలో ఒక మోస్తరు వర్షం పడింది. పెనుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి.

పులిపాడులో మొసలి కలకలం
గురజాల, మే 5: మండలంలోని పులిపాడులో ఉన్న దండివాగులో మూడు రోజులుగా కలకలం సృష్టించి న మొసలిని గురువారం అటవీ శాఖాధికారులు పట్టుకుని కృష్ణా నదిలో వదిలారు. పులిపాడులోని దండివాగులో మొసలి కనిపించడంతో ప్రజలు భ యాందోళనలకు గురయ్యారు. మూ డు రోజుల నుండి సంచరిస్తున్న మొస లి వాగులోకి వెళ్ళిన ఒక కోతిని, లేగ దూడను చంపి తినేసిందని స్థానికులు అంటున్నారు. ఈ మేరకు గ్రామస్థుల నుండి సమాచారం అందుకున్న మా చర్ల అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ రామిరెడ్డి, డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్ గౌడ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తిరుపతిరావు వాగు వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం వాగు లో 20 అడుగుల లోతులోని కలుగులో మొసలి ఉన్నట్లు గుర్తించి పొక్లెయిన్ సహాయంతో తవ్వి బయటకు తీశారు. మొసలిని దైద గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో వదిలిపెట్టనున్నట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

బాపూజీ సాక్షిగా అబద్ధాలు బిజెపికే చెల్లింది
తెనాలి, మే 5: నాడు గాంధీజీ సాక్షిగా పార్లమెంటులో ప్రత్యేక హోదా విషయంలో అన్నిటికి సమ్మ తం తెలిపి ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పటం కేంద్రంలోని బిజెపి నాయకులకే చెల్లిందని కాంగ్రెస్ జిల్లా డాక్టర్స్ సెల్ సీనియర్ నాయకుడు డాక్టర్ చందు సాంబశివుడు విమర్శించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సాంబశివుడు మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ సమయంలో తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని నిర్ణయించినప్పుడు ఇప్పటి బిజెపి నాయకులు వెంకయ్యనాయుడు, హోం, ఆర్థిక శాఖామంత్రి రాజ్యసభలో పూర్తి మద్దతు తెలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓ ప్రధాని చేసిన చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయటమే కాకుంటా విభజన పేరుతో అన్యాయమైపోయిన నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించటం కుదరదని చెప్పటం తెలుగు ప్రజలను మోసం చేయటమే అన్నారు. ఏ విభజన పేరు తో కాంగ్రెస్‌ను ఓడించారో ఆ విభజనలోని హో దాతో రాష్ట్ర ప్రజలు బిజెపిని ఘోరంగా ఓడించే పరిస్థితిని తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించటం, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేంద్రమే కేటాయించటం, జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేయటం, కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కట్టడాలను అడ్డుకోడం, రాష్ట్ర రెవెన్యూ లోటు 14 కోట్లు చెల్లింపు, రాజధాని నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధుల కేటాయింపు, స్పెషల్ రైల్వే జోన్ ఏర్పాటు వంటి అంశాలతోపాటు కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపిలు మద్దతు ప్రకటించాలి వంటి డిమాండ్లను తక్షణమే పరిష్కరించకుంటే ప్రజా సహకారంతో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహబూబ్, పఠాన్ హంహేర్, భూమా రమేష్, చందు రాజశేఖర్, ఎన్ మల్లిఖార్జునరావు, కలీల్, బడుగు శ్రీనివాసరావు, పల్లి సుధాకర్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విభజన వల్లే
రాష్ట్రానికి ఈ దుస్థితి

గుంటూరు (కొత్తపేట), మే 5: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి ప్రధానసూత్రధారి కాంగ్రెస్ పార్టీయేనని, విభజన అంశంలో ప్రత్యేకహోదా, ప్యాకేజీలను పొందుపర్చక పోవడం వలనే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ అతిరథ మహారథులు, హేమాహేమీలంతా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టిసారించకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వలనే నేడు హోదా అంశం సంగిద్ధంలో పడిందన్నారు. సోనియాతో బొత్స సత్యనారాయణ, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి కుమ్మక్కై రాష్ట్ర విభజనకు కారకులయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్గించిన వీరిద్దరూ బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, హోదా నిధుల అంశాలను విభజన సమయంలో పొందుపర్చక పోవడం వలనే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలోని బిజెపి నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేకహోదా సాధించేందుకు కలిసి రావాలని కోరారు. ప్రత్యేక హోదా అంశంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే, రెండవ ముద్దాయిగా బిజెపి ఉందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రత్యేకహోదాకు ఐదేళ్లు ప్రకటిస్తే పదేళ్లు హోదా ఇవ్వాలని గళమెత్తారని, ఈ అంశాన్ని బిజెపి నేతలు దృష్టిలో ఉంచుకుని హోదా అంశంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. బిజెపి ప్రభుత్వం తమకు మిత్రపక్షంగా ఉండబట్టే రాష్ట్రంలోని పోలవరంతో పాటు రోడ్లనిర్మాణం కోసం 60 వేల కోట్లు ఇచ్చిందని, కేంద్ర కార్యాలయాలు కూడా ఇక్కడ నిర్మించేందుకు కృషిచేస్తోందన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా 10 లక్షల ఇంకుడు గుంటలు లక్ష్యంగా పనిచేస్తుంటే అందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వాములు అవుతున్నారన్నారు. 3 లక్షల గుంతలను ఇప్పటికే పూర్తిచేశామని, 13,600 కోట్ల రూపాయలతో 8.5 లక్షల సేద్యపు నీటికుంటలను కూడా పూర్తిచేస్తున్నామన్నారు.

ప్రత్యేక హోదా సాధనకు రాష్టవ్య్రాప్త ఉద్యమాలు
గుంటూరు (కొత్తపేట), మే 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, హోదా సాధనకు రాష్టవ్య్రాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమితి సమావేశానికి హాజరైన సందర్భంగా రామకృష్ణ విలేఖర్లతో మాట్లాడారు. ఏపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర లోటుబడ్జెట్‌ను భర్తీచేయడం, రాజధాని నిర్మాణం, పోలవరం, విశాఖలో రైల్వేజోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాలకు సహకరిస్తామన్న కేంద్రప్రభుత్వం నేడు మాటతప్పిందన్నారు. 2018 నాటికి పోలవరాన్ని పూర్తిచేస్తామని చెప్పి 850 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇలా అయితే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 17 వేల కోట్ల రూపాయల లోటుబడ్జెట్ భర్తీకి 2,805 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి జయంత్ సిన్హా జీరో అవర్‌లో ప్రస్తావించారని, పూర్తి నిధులను కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో అక్కడి ప్రధాని మన్మోహన్‌సింగ్, ఎపికి 5 సంవత్సరాలు ప్రత్యేకహోదా కల్పిస్తే ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నేత వెంకయ్యనాయుడు 10 సంవత్సరాల పాటు హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమో రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమో చంద్రబాబు తేల్చుకోవాలన్నారు. ప్రత్యేకహోదాపై ఈనెల 8,9 తేదీల్లో అనంతపురంలో దీక్షలు చేస్తున్నట్లు, 18వ తేదీన గుంటూరులో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు నీళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాధాన్యతగల అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాకుండా సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఇద్దరు చంద్రులు దృష్టిసారించాలన్నారు. ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన పర్యటించే ప్రాంతంలో సిపిఐ, సిపిఎం నాయకులను ముందస్తుగా అరెస్ట్‌లు చేయిస్తున్నారని, ఇలాంటి చర్యలను మానుకోవాలన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు హోదాతో ముడిపడి ఉందని, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుపై బిజెపి తాత్సారం భవిష్యత్తులో రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం
గుంటూరు, మే 5: రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడివున్న ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో వైసిపి నగర శ్రేణులు భగ్గుమన్నాయి. హోదా తెస్తాం, ఇస్తామన్న నేతలను ఎండగడుతూ గురువారం నగరంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కుచ్చుటోపీ పెట్టిన నేపథ్యంలో అయినా తెలుగుదేశం ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు పక్కనపెట్టాలని హితవుపలికారు. లేకుంటే ప్రజలు క్షమించరని స్పష్టంచేశారు. ప్రత్యేకహోదా సాధనకు చంద్రబాబు స్వయంగా ముందుకొచ్చి ఉద్యమించినా తాము మద్దతిస్తామన్నారు. గడచిన రెండేళ్లుగా జగన్ నేతృత్వంలో తమ పార్టీ ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న ఉద్యమాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. చరిత్ర హీనులుగా మిగలకుండా ఉండాలంటే మీనమేషాలు మాని ప్రత్యేకహోదా సాధన కోసం జరుగుతున్న పోరాటంలో కలిసి రావాలన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా సాధనకై జరుగుతున్న పోరులో ప్రజాసంఘాలు, అన్ని పార్టీలు, ప్రజలకు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఆంధ్రులను ఉమ్మడిగా మోసం చేశాయని మండిపడ్డారు. ఇప్పటివరకు కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేసి తాపీగా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేకహోదాను సాధించుకునే వరకు జగన్ నేతృత్వంలోని వైఎస్‌ఆర్ సిపి రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. రాస్తారోకోలో వైసిపి వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, జగన్ కోటి, కొత్త చిన్నపరెడ్డి, పానుగంటి చైతన్య, జాన్సీ, రాఘవ, జానీ, కేసరి, వెంకటసుబ్బారెడ్డి, నర్సిరెడ్డి, అబ్దుల్లా, మేడా సాంబశివరావు, లక్కాకుల నాగేశ్వరరావు, పసుపులేటి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

భూ సేకరణపై న్యాయపోరాటం: ఆర్కే

మంగళగిరి, మే 5: రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు భూములివ్వని రైతులకు చెందిన భూములను ప్రభుత్వం సేకరణకు పూనుకుంటే రైతుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, వైసీపీ నాయకులతో కలిసి హైదరాబాదులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసినట్లు ఆర్కే పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పర్యాటక అభివృద్ధి కోసం ఈ భూమిని సేకరిస్తామంటే రైతుల భూములజోలికొస్తే సహించబోమంటూ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేడు సేకరణకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. రాజధానిలో రైతులు, రైతుకూలీలు, కౌలురైతులు, చేతివృత్తిదారుల కోసం వారు చేసే పోరాటానికి చివరివరకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారని, భూ సమీకరణ సమయంలో ఇష్టమైతేనే భూములివ్వాలని, బలవంతం లేదని ఇంటింటికీ తిరిగి చెప్పిన మంత్రులు, అధికారులు నేడు సేకరణ దిశగా అడుగులు వేయడం ఎందుకుని ఆయన ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టప్రకారం మూడు పంటలు పండే భూములను సేకరించరాదని స్పష్టంగా ఉందని, దీన్ని సవరించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నించినా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందక వెనక్కు తగ్గిందని ఆర్కే పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పంటూ కాలయాపన చేసేందుకు కొత్త నాటకానికి తెరతీశారని, ప్లాన్‌పై తొలిరోజుల్లోనే విమర్శలు రాగా ఇప్పటి వరకు ఎందుకు మార్చుకోలేదని ఆయన అన్నారు. గ్రామకంఠాలు, ప్లాట్ల కేటాయింపులు, కౌలు పరిహారంపై పలు సమస్యలపై రైతులు ఎక్కడ తిరగబడతారోననే ఆందోళనతో మాస్టర్ ప్లాన్‌లో మార్పులంటూ కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికే మాస్టర్ ప్లాన్‌కోసం చేసిన ఖర్చు రికవరీ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

కేసులు నమోదు చేసి.. వదిలేస్తున్నారు: ఎఎస్‌పి
చేబ్రోలు, మే 5: కేసులు నమోదు చేస్తున్నారు.. వాటిని మళ్లీ బుట్టదాఖలు చేస్తున్నారు.. ఇలా ఎందుకు జరుగుతుంది? ... అంటూ లా అండ్ ఆర్డర్ ఎఎస్‌పి ఇఎస్ రాయుడు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చేబ్రోలు పోలీసుస్టేషన్‌ను ఎఎస్‌పి రాయుడు గురువారం ఆకస్మికంగా తనిఖీచేసిన సమయంలో ఎస్సై కె ఆరోగ్యరాజు అందుబాటులో లేకపోవడంతో సిఐ జి రవికుమార్ ద్వారా కేసుల పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2014 సంవత్సరం నుంచి ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉండటంపై ఎఎస్‌పి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. పోలీసుస్టేషన్‌లో ప్రైవేటు వ్యక్తుల చేత కంప్యూటర్ వర్కు ఎందుకు చేయిస్తున్నారని సిఐ రవికుమార్‌ను ప్రశ్నించారు. ఎస్‌ఐ ఆరోగ్యరాజు పనితీరు ఏమీ బాగోలేదని ఎఎస్‌పి రాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.