గుంటూరు

చక్రస్నానంతో ముగిసిన శ్రీరామకోటి మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 11: ఉభయ రాష్ట్రాల్లోని భక్తులతో పాటు చెన్నై, బెంగళూరు, ఒడిస్సా నుంచి వేలాదిగా తరలివచ్చిన రామభక్తులను భాగస్వాములను చేస్తూ, నగరంలోని ఆర్ అగ్రహారం సంపత్‌నగర్‌లో ప్రసిద్ధిపొందిన శ్రీ రామనామక్షేత్రంలో ఐదు రోజులుగా జరుగుతున్న 85వ శ్రీ రామకోటి మహోత్సవాలు సోమవారం నాటి శ్రీచక్రస్నానంతో నేత్రపర్వంగా ముగిశాయి. గత రాత్రి తెప్ప తిరునాళ్ల ఉత్సవాన్ని అసంఖ్యాక భక్తజనుల సమక్షంలో ప్లవోత్సవంలాగా నిర్వహించిన అర్చక బృందం శ్రీసీతారామనామ సంకీర్తనా సంఘం సభ్యులు చివరిరోజైన సోమవారం అదేరీతిలో అవబృథోత్సవాన్ని, వసంత సేవను, గోపాల ఖేల్‌ను నయనానందకరంగా నిర్వహించారు. గంగాళాలలో శ్రీ గంధం, చందనం, కస్తూరితో మేళవించిన పుష్కరణి జలాలతో సీతారామ చంద్ర, లక్ష్మణ, ఆంజనేయ ఉత్సవ మూర్తులకు చక్రస్నానాన్ని పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో పాంచాహ్నిక విధి విధానాలకు అనుగుణంగా అర్చక స్వాములు నిర్వహించారు. శ్రీమాన్ క్రోసూరి మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యాన 25 మంది అర్చకులు, రుత్విక్కులు నిత్య జపహోమ, తర్పణ పారాయణలు యజ్ఞశాలలో నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించి మూర్తికుంభ తీర్ధప్రోక్షణ గావించారు. ఉత్సవ మూర్తులకు వినియోగించిన పుణ్య జలాలను భక్తులపై చల్లారు. రామకోటి మహోత్సవాల్లో చివరిరోజున వసంతోత్సవం, అవబృథోత్సవం చక్రస్నానంలో పాల్గొంటే రామనుగ్రహం లభిస్తుందన్న ధృడవిశ్వాసంతో వయోభేదం లేకుండా భక్తజనం తరలివచ్చారు. అన్నపూర్ణ ఆలయంలో వేలాది మంది భక్తులకు శ్రీరామ కైంకర్య ప్రసాదాన్ని అందజేశారు. ధ్వజావరోహణం, ద్వాదశారాధన జరిగింది. వీటితో ఐదు రోజుల శ్రీరామకోటి మహోత్సవాలు వేడుకగా హనుమత్‌సేవ మధ్య ముగిశాయి.
రెండు లారీలు ఢీ, డ్రైవర్ దుర్మరణం
మంగళగిరి, డిసెంబర్ 11: 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళగిరి సమీపంలోని రత్నాలచెరువు వద్ద సోమవారం తెల్లవారుఝామున రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో వెనుక లారీ డ్రైవర్ మంజునాధ (40) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ క్లీనర్‌ను చికిత్స కోసం తరలించారు. పొలీసుల కథనం ప్రకారం గుంటూరు వైపునుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీని వెనుకనుంచి మరోలారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ దుర్ఘటనలో వెనుకలారీ డ్రైవర్ మంజునాధ మృతిచెందగా క్లీనర్ గాయపడ్డాడు. గాయపడ్డ క్లీనర్‌ను చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.